చంద్రబాబును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నది అందుకేనా.. “కన్నా.”.?

“లోకేష్, చంద్రబాబు ఆదేశాల మేరకే.. టీడీపీ కార్యకర్తలు నా ఇంటి మీదకు వచ్చారు. వాళ్లంతా నన్ను చంపడానికే వచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తా..” ఇదీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పిన మాట. కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ను.. బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దానికి నిరసనగా.. టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని కన్నా ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత కన్నా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అసలు శాంతిభద్రతలే లేవని.. టీడీపీ కార్యకర్తలు తనను చంపడానికే వచ్చారని.. ఆరోపణలు గుప్పించారు. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని… ఏపీలో ప్రతిపక్ష నేతలు రోడ్డు మీదకు రాలేని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.

ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తేనే.. తనను చంపడానికి వచ్చినట్లు ఫీలైపోతున్న కన్నా లక్ష్మినారాయణ.. కాకినాడలో బీజేపీ కార్యకర్తలు.. చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డు పడటం దేని కోసమే చెప్పగలరా..? కన్నా చెప్పిన ధీయరి ప్రకారం.. చంద్రబాబును చంపడానికే బీజేపీ కార్యకర్తలు.. కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న… చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం తీవ్రమైన నేరం అని.. బీజేపీ కార్యకర్తలకు తెలియదా..? తెలిసినా కూడా.. అదే పని చేయడానికి ప్రత్యేకంగా.. ఎందుకు కాపు కాశారు..? దీని వెనుక కన్నా చెప్పినట్లుగా… అతి పెద్ద కుట్ర ఏమైనా ఉందా..?

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతలు.. వ్యవహరిస్తున్న తీరు… వారు నేరుగా ఏపీపై అంటే.. సొంత రాష్ట్రంపైనే దాడికి పాల్పడుతున్నట్లుగా ఉంది కానీ… రాష్ట్ర ప్రయోజనాల కోసం … ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించడం లేదనే విమర్శలు సామాన్యుల నుంచి వస్తున్నా.. వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రధాని నరేంద్రమోడీని సంతృప్తి పరచడానికి సొంత రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని.. ” లుచ్చా..” అంటూ.. వ్యాఖ్యానించిన బీజేపీ నేతల తీరు..ఇప్పటికే.. ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. చిన్నపాటి రాజకీయ ఆందోళనలను కూడా… పెద్దగా చిత్రీకరించి.. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తూ.. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందంటూ… హెచ్చరించడంపై ప్రజల్లో మరింత వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఈ విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. గుర్తించినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close