” క్రికెట్‌లో పోయినా బోర్డర్‌లో గెలుస్తూ ఉన్నాం ” …ఇదేమి దేశభక్తి?

పాకిస్తాన్‌తో ఆడిన క్రికెట్ మ్యాచ్‌లో ఏ ఒక్కరూ కూడా ఊహించని విధంగా ఇండియా ఓడిపోయింది. ఏ ఒక్కరూ కూడా ఊహించని విధంగా ఫలితాలు వస్తూ ఉండడంతోనే క్రికెట్‌పైనే బోలెడన్ని అనుమానాలు కలుగుతున్న పరిస్థితి. ఛాంపియన్స్ ట్రోఫీలో అలాంటి మ్యాచ్‌లు ఎన్నో. లీగ్ స్థాయిలో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు సభ్యులు అందరూ కూడా మరీ స్కూల్ పిల్లల్లా ఆడేశారు. ఇక ఫైనల్‌లో భారత క్రికెటర్స్ అదే స్థాయి ఆటతీరు చూపించారు. కాకపోతే అద్భుతంగా ఆడాలనుకుంటున్నాం అన్న కలరింగ్ మాత్రం బాగా ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో సహా మిగతా టీమ్స్ ఆడిన మ్యాచ్‌లలో అలాంటి ఫలితాలే వచ్చాయి. ప్రముఖ మాజీ పాకిస్తాన్ క్రికెటరే మ్యాచ్‌కి ముందే ఫిక్సింగ్ జరిగిందని చెప్పాక అలాంటి విషయాలు మాట్లాడుకోవడం అనవసరం. కానీ కొంతమంది క్రికెట్టాభిమానులు ‘క్రికెట్‌లో ఓడిపోతేనేం…బోర్డర్‌లో గెలుస్తూ ఉన్నాం’ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఉండడం మాత్రం బాధాకరం.

మాజీ ఇండియన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కాశ్మీర్ అంశాన్ని, క్రికెట్‌లో గెలుపుని పోలస్తూ కామెంట్ చేయడమే తప్పు. ఇక అభిమానులు బోర్డర్‌లో సైనికుల పోరాటంతో క్రికెటర్ల ఆటను పోల్చడం మరీ దారుణం. మీడియా వాళ్ళు కూడా యుద్ధం అంటూ తోచిన పదాలు వాడేస్తూ ఆ పదాల ప్రాముఖ్యతను తగ్గించేస్తున్నారు. ఈ రోజు ఉన్న ‘పైసా వసూల్’ క్రికెట్‌ని ఏ స్థాయిలో అభిమానిస్తారో….ఆ అభిమానాన్ని పీక్స్‌కి తీసుకెళ్ళడానికి ఏ స్థాయిలో ప్రచారం చేయిస్తారో వాళ్ళిష్టం. కానీ క్రికెటర్ల ఆటను, బోర్డర్‌లో సైనికుల పోరాటలను పోల్చుతూ కామెంట్స్ చేయడం మాత్రం భావ్యం కాదు. అసలు ఆ కోణంలో ఆలోచింపచేసేలా ఎవరు ఏం రాసినా కూడా చాలా పెద్ద తప్పే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close