తెరాస‌ది వ్యూహాత్మ‌క మౌనం అనుకోవ‌చ్చా..!

ఓ వారం రోజులుగా రేవంత్ రెడ్డి ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆయ‌న పార్టీ మార్పు వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న పార్టీ వీడిపోతున్న స‌మ‌యంలో తెలుగుదేశం నేతలు చాలా విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ లో చేరుతున్న సంద‌ర్భంగా ఆ పార్టీ నాయ‌కులూ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, ఎవ‌రితో పోరాట‌మ‌ని పార్టీ మారుతున్నారో.. ఆ నాయ‌కులు ఈ అంశంపై స్పందించ‌కపోవ‌డం విశేషం! కేసీఆర్ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఏకం చేయాల‌న్నదే త‌న పోరాట పంథాగా రేవంత్ చెబుతూ వ‌స్తున్నారు. మొన్న కొడంగ‌ల్ లో కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మైన‌ప్పుడుగానీ, నిన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ హాజ‌రైన స‌మావేశంలోగానీ రేవంత్ చెబుతున్న మాట ఇదే. అయితే, ఇంత జ‌రుగుతున్నా అధికార పార్టీ నుంచి ఎవ్వ‌రూ పెద్ద‌గా స్పందించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలపై తెరాస మౌనంగానే ఉంటోంది. నాయ‌కుల్ని మీడియా అడుగుతున్నా కూడా స్పందించ‌డం లేదు! ఇదంతా వ్యూహాత్మక‌ మౌనం అనుకోవ‌చ్చా… దీని వెన‌క వేరే కార‌ణాలున్నాయా..?

రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంపై తెరాస స్పందించ‌క‌పోవ‌డం వెన‌క కార‌ణం.. ఈ అంశానికి అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌డం అన‌వ‌స‌రం అని భావించ‌డం! రేవంత్ మీద తెరాస కూడా ఈ త‌రుణంలో విమ‌ర్శ‌లు ప్రారంభిస్తే, అది రేవంత్ కు మ‌రింత ప్ర‌చారం తెచ్చిపెట్టిన‌ట్టు అవుతుంది. కాంగ్రెస్ లో చేరుతున్న ఈ తరుణంలో ఆయ‌న‌కు మ‌రింత ప్రాధాన్య‌త పెంచిన‌ట్టు అవుతుంది. అందుకే, తెరాస నేత‌లు మౌనంగా ఉన్నార‌ని అనుకోవ‌చ్చు! అలాగ‌ని, ఈ వ్య‌వ‌హారాన్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అనుకోలేం! తెర వెన‌క తెరాస చేయాల్సిన ప‌నుల‌న్నీ చేస్తోంద‌ని తెలుస్తోంది. నిజానికి, ఓ నెల రోజుల కింద‌ట నుంచే అధికార పార్టీ వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు మొద‌ల‌య్యాయని చెప్పొచ్చు. కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంపై మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ట‌! రేవంత్ పార్టీ మార‌డం ఖాయ‌మ‌నేది వారికి ఉన్న సోర్స్ ద్వారా అత్యంత విశ్వ‌స‌నీయంగా నెల ముందే తెలిసింద‌నీ, ఉప ఎన్నిక రావొచ్చ‌నే ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తోనే ఆ నియోజ‌క వ‌ర్గంపై మంత్రి ప్రత్యేక శ్ర‌ద్ధ పెట్టిన‌ట్టు చెబుతున్నారు. దాన్లో భాగంగానే ఈ మ‌ధ్య కొంత‌మంది కొడంగ‌ల్ నేత‌లు తెరాస‌లో చేరిక జ‌రిగింద‌ని చెబుతున్నారు.

కొడంగ‌ల్ ఉప ఎన్నిక విష‌య‌మై ఓ నెల్రోజుల కింద‌టే అధికార పార్టీలో ప్ర‌ముఖ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌నీ, రేవంత్ పార్టీ వీడ‌టం ఖాయ‌మ‌ని వారు ఓ అంచ‌నాకు ముందే వ‌చ్చార‌నీ, తెరాస‌పై రేవంత్ ఎంతగా నోరు పారేసుకున్నా నేత‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని కూడా అధినాయ‌క‌త్వం నుంచి సూచ‌న‌లు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. రేవంత్ పార్టీ మార్పు అనేది ఏదో చిన్న విష‌యం అన్న‌ట్టుగా తెరాస వ్య‌వ‌హార శైలి పైపైకి క‌నిపిస్తున్నా… తెర వెన‌క ఆ పార్టీలో అంత‌ర్మ‌థ‌నం బాగానే జ‌రుగుతోంద‌న్న‌ది వాస్త‌వం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close