రాంగోపాల్ వర్మ పై టీవీ9 ఉక్కుపాదం?

జీఎస్టీ సినిమా ప్రమోషన్లో భాగంగా లో భాగంగా టీవీ9 లో జరిగిన చర్చలో మహిళా సామాజిక వేత్త పై రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత వారు పోలీస్ కంప్లైంట్ చేయడము, దీంతో పోలీస్ కేసులు నమోదు కావడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం మొత్తానికి tv9 లో లభిస్తున్న కవరేజి, అలాగే టీవీ9 ధోరణి చూస్తుంటే వర్మపై ఈ ఛానెల్ ఉక్కుపాదం మోపుతోందా అన్న అనుమానం కలగకమానదు.

వర్మ ఒక పోర్న్ వీడియో తీశాడు. అయితే దీనిపై ఛానళ్లలో చర్చలు నిర్వహించి ఎంత పబ్లిసిటి కావాలో ఆ వీడియో కి అంత పబ్లిసిటీ ఇచ్చాయి అన్ని ఛానళ్ళు. అసలు రామ్ గోపాల్ వర్మ తుమ్మినా, దగ్గినా కూడా టీవీ9 లో స్క్రోలింగ్ వస్తుందని కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు . ఆయన రాసే ప్రతి (అ)సందర్భమైన ట్వీట్ ని కూడా టీవీ9 లో ప్రముఖంగా ప్రచారం చేసేవారు. అదేవిధంగా జీఎస్టీ విషయంలో కూడా పబ్లిసిటీ కల్పించాయి ఈ చానల్స్.

అయితే ఇప్పుడు అదే tv9 ఛానెల్ వర్మ కేసు ని, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలనీ విపరీతంగా చూపిస్తూ వర్మ ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేయడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఎక్కడ చిన్న తేడా కొట్టిందో తెలీడం లేదు కానీ ఇప్పుడు వర్మ మీద జరుగుతున్న పోలీసులు కేసుల విషయంలో ప్రతి చిన్న అంశాన్ని చూపిస్తూ వర్మ కి చుక్కలు చూపిస్తోంది టివి9. రాంగోపాల్ వర్మ ఇటీవల తాను టివి9 పై పోలీస్ కేసు పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రకటన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వర్మ కేసుల కి పూర్తిగా కవరేజి ఇస్తూ వర్మ ని ఇరుకున పెడుతోంది. అసలెప్పుడూ ఎవరికీ సారీ చెప్పని వర్మ ఈమధ్య మహిళా సామాజికవేత్తలకి సారీ చెప్పడం గమనార్హం.

మరి వర్మ-టివి9 ల బంధం మున్ముందు ఏ మలుపు తిరగనుందో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.