బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ ద‌ట్టిగా ద‌ట్టించిన ‘వార‌సుడు’

ఈ సంక్రాంతి వ‌స్తున్న ‘వీర సింహారెడ్డి’ యాక్ష‌న్ సినిమా అయితే… ‘వాల్తేరు వీర‌య్య‌’ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. వీటి మ‌ధ్య వ‌స్తున్న ‘వార‌సుడు’ది మాత్రం ఫ్యామిలీ మార్కు సినిమా. విజ‌య్‌కి మాస్‌ల మంచి ఫాలోయింగ్ ఉంది. త‌న‌దంతా మాస్ బాణీనే. అయితే… ఈసారి మాత్రం క్లాస్ ట‌చ్‌తో కూడుకున్న క‌థ ఎంచుకొన్నాడ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ‘వార‌సుడు’లో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ గ‌ట్టిగా ద‌ట్టించార‌ని స‌మాచారం. ఇందులో విజ‌య్‌, శ్రీ‌కాంత్, ప్ర‌భు, శ‌ర‌త్ కుమార్‌… వీళ్లంతా సోద‌రుల్లా న‌టించార‌ని టాక్‌. ఈ బ్ర‌ద‌ర్ సెంటిమెంట్ తో రూపొందించిన సీన్లు… జ‌య‌సుధ‌, ప్ర‌కాజ్ రాజ్ ఎపిసోడ్లు కుటుంబ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉన్నాయ‌ని స‌మాచారం. శ్రీ‌కాంత్ కి చాలా రోజుల తర‌వాత మంచి పాత్ర ప‌డింద‌ని చెబుతున్నారు. శ్రీ‌కాంత్ కూడా ‘వార‌సుడు’ పై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. కాక‌పోతే… ‘వార‌సుడు’పై త‌మిళ సినిమా ముద్ర ఎక్కువ‌గా ఉంది. దీనికి ఎన్ని హంగులు చేసినా, తెలుగు స్టార్స్‌ని ఎంత మందిని దించినా డ‌బ్బింగ్ సినిమాగానే క‌నిపిస్తోంది. విజ‌య్ సైతం.. ఇది త‌మిళ సినిమానే అనే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కాక‌పోతే… ఫ్యామిలీ ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ అయితే.. డ‌బ్బింగ్ సినిమానా? స్ట్ర‌యిట్ సినిమానా? అనేది ఆలోచించ‌రు ప్రేక్ష‌కులు. విజ‌య్ ‘బీస్ట్కి’ తెలుగు నాట మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. పైగా ఈసారి సంక్రాంతికి వ‌స్తున్నాడు. ఇవ‌న్నీ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close