వెంకటేష్ సినిమా అడ్రస్ గల్లంతు

‘నేను శైలజా’ లాంటి డిసెంట్ హిట్ తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమల, విక్టరీ వెంకటేష్ తో జతకట్టాడు. వీరిద్దరి కలయికలో ‘ఆడాళ్లూ… మీకు జోహార్లు’ అనే సినిమా ప్రకటన వచ్చింది. పి.ఆర్‌.సినిమాస్‌ పతాకంపై నిర్మాత రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటన చేశారు.

హీరోయిన్ గా నిత్యమేనన్ ను ఎంపిక చేశారు. ”ఏజ్ గ్యాప్ వున్నా ఓ జంట మధ్య ప్రేమ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. కథని వినోదాత్మకంగా తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమా షూటింగ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా” అంటూ ఆమధ్య ఓ ప్రకటన కూడా చేసింది నిత్య. అనసూయ, తెజస్వీలను కూడా కీలక పాత్రలలో ఎంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. షూటింగ్ కూడా మొదలైయింది.

అయితే మధ్యలో ఏమైయిందో.. ఈ సినియా జాడ లేకుండా పోయింది. ఈ సినిమాకి సంబధించి ఎలాంటి అప్డేట్ లేదు. పెద్దనోట్ల రద్దు ప్రభావం ఈ సినిమా పై పడింది అని ఆ మధ్య ఓ కబురు వినిపించింది. అంతే.. అప్పటి నుండి ఈ సినిమా ఆజాపాజా లేకుండాపోయింది. ఇప్పుడు దర్శకుడు కిషోర్ తిరుమల, రామ్ సినిమాతో బిజీ అయిపోయాడు. ‘ఆడాళ్లూ… మీకు జోహార్లు’ మాత్రం అడ్రస్ లేకుండా వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.