డిజాస్ట‌ర్ ఎఫెక్ట్‌… కైరాపై?!

వ‌చ్చీ రాగానే మ‌హేష్ బాబుతో క‌ల‌సి న‌టించే సూప‌ర్ ఛాన్స్ కొట్టేసింది కైరా అడ్వానీ. భ‌ర‌త్ అనే నేను సెట్స్‌పై ఉండ‌గానే… డివివి దాన‌య్య మ‌రో రెండు సినిమాల‌పై ఎగ్రిమెంట్ చేయించేశాడు. రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామాలోనూ కైరానీ క‌థానాయిక‌గా తీసుకోవ‌డంతో – అతి తొంద‌ర‌లోనే కైరా టాప్ లీగ్‌లో చేరిపోయింది. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కైరాని క‌థానాయిక‌గా ఎంచుకునే అవ‌కాశాలున్నాయ‌న్న టాక్స్ వినిపించాయి. దాంతో.. కైరా ద‌శ తిరిగిపోయింద‌నుకున్నారంతా.

కానీ `విన‌య విధేయ రామ‌` డిజాస్ట‌ర్ కైరా కెరీర్‌పై భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. `భ‌ర‌త్ అనే నేను` సూప‌ర్ హిట్‌తో కైరా ఎంత లాభ‌ప‌డిందో తెలీదు గానీ, ‘విన‌య విధేయ రామ‌’ ఫ్లాప్ తో మాత్రం త‌న కెరీర్ చిక్కుల్లో ప‌డింది. ఇప్పుడు పెద్ద హీరోలు, బ్యాన‌ర్లు కైరాని లైట్ తీసుకోవ‌డం మొద‌లెట్టాయి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నుంచి కూడా కైరా పూర్తిగా సైడ్ అయిపోయిన‌ట్టే. స్టార్ హీరోలు ప‌క్క‌న పెడితే మీడియం రేంజు క‌థానాయ‌కుల‌తో స‌ర్దుకుపోవాలి. మ‌రి కైరా అందుకు రెడీయేనా? మ‌రోవైపు బాలీవుడ్‌లో మాత్రం కైరాకి ఇంకా ఆఫ‌ర్లు అందుతున్నాయి. అక్క‌డ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ జ‌ర్నీకి ప్ర‌స్తుతానికి కామా పెట్టి, బాలీవుడ్ పైనే దృష్టి పెట్టాల‌ని కైరా భావిస్తున్న‌ట్టు టాక్‌. ప్ర‌స్తుతానికి అదే మంచిది కూడా. బాలీవుడ్లో మ‌రో హిట్టు ప‌డ‌గానే కైరాకి మ‌ళ్లీ స్వాగ‌త స‌త్కారాలు అందేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com