క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌ ప్ర‌చారానికి జ‌గ‌న్ వెళ్లలేరా..?

క‌ర్ణాటక ఎన్నిక‌ల‌పై తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. ఎవ‌రి అజెండాల‌తోవారు ఆ రాష్ట్ర ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి చూపుతున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ని క‌లిసొచ్చారు. అవ‌స‌రమైతే జేడీఎస్ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేసేందుకు వ‌స్తానని కూడా చెప్పారు. ఇక‌, ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం కూడా ఆ రాష్ట్ర ఎన్నిక‌ల‌పై దృష్టి సారించింది. తెలుగు ప్ర‌జ‌లు స్థిర‌ప‌డ్డ ప్రాంతాల్లో ప్ర‌చారం చేసేందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉంది. క‌ర్ణాట‌క‌లో తెలుగువారి సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. దాదాపు ముప్ఫైకి పైగా నియోజ‌కవ‌ర్గాల్లో నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఉన్నారు. కాబ‌ట్టి, తెరాస టీడీపీలు త‌మవంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

కేసీఆర్ లక్ష్యం భాజ‌పాయేత‌ర‌, కాంగ్రెసేత‌ర ఫ్రెంట్ ఏర్పాటు. దానికి దేవెగౌడ మ‌ద్ద‌తు కావాలి. అందుకే, ఆయ‌న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జెడీఎస్ కి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల‌ను కోరారు. ఇక‌, టీడీపీ పోరాటం హోదా కోసం కాబ‌ట్టి, క‌ర్ణాట‌క‌లో బీజేపీని ఓడించాలంటూ ఆ పార్టీ ప్ర‌చారానికి సిద్ధ‌మౌతోంది. నిజానికి, కేసీఆర్ ఫ్రెంట్ ఏర్పాటు కంటే… టీడీపీ మొద‌లుపెడుతున్న ప్ర‌చార‌మే భాజ‌పాకి మింగుడుప‌డ‌టం లేద‌ని చెప్పాలి. ఏపీలో హామీలపై స్పందించ‌క‌పోతే… ఆ ప్ర‌భావం ప‌క్క రాష్ట్రాల్లో ఉండ‌ద‌ని వారు అనుకున్నారు. అనూహ్యంగా తెలుగువారు స్థిర‌ప‌డ్డ ప్రాంతాల్లో కూడా త‌మ‌కు వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌నేది అంచ‌నా వేయ‌లేక‌పోయారు. అయితే, ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పంద‌న ఎలా ఉండ‌బోతుందా అనేది చ‌ర్చ‌నీయం అవుతోంది.

నిజానికి, బెంగ‌ళూరుతో జ‌గ‌న్ కి బాగానే సంబంధాలున్నాయి! కొన్నేళ్ల‌పాటు ఆయ‌న అక్క‌డే ఉన్నారు. రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచి అత్య‌ధికంగా బెంగ‌ళూరుకు వల‌స వెళ్లి స్థిర‌ప‌డ్డ‌వారూ ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో జ‌గ‌న్ ప‌ర్య‌టించి భాజ‌పా వ్య‌తిరేక పోరాటం చెయ్యొచ్చు. సొంత రాష్ట్రానికి అన్యాయం జ‌రిగింద‌నీ, హోదా ఇవ్వ‌ని భాజ‌పాకి ఓటెయ్య‌ద్ద‌ని అక్క‌డి తెలుగువారికి విజ్ఞ‌ప్తి చెయ్యొచ్చు. అది కూడా హోదా సాధ‌న పోరాటంలో భాగ‌మే క‌దా. కేంద్రంపై ఒత్తిడి పెంచే మ‌రో మార్గ‌మే ఇది. కానీ, ఈ దిశ‌గా జగ‌న్ స్పంద‌న ఎలా ఉంటుందీ, అస‌లు స్పంద‌న ఉంటుందా అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. హోదా పోరాటంలో మొద‌ట్నుంచీ గ‌మ‌నిస్తే, భాజ‌పా ల‌క్ష్యంగా వైకాపా ప్ర‌య‌త్నం ఉండ‌టం లేదు. భాజ‌పాని విమ‌ర్శించాలంటే ఇప్ప‌టికీ వైకాపా నేత‌లు స‌న్నాయి నొక్కులే నొక్కుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలోని అధికార పార్టీపై ఒత్తిడి పెంచే అవ‌కాశాన్ని వైకాపా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందా లేదా అనేది వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close