విజయమ్మ ప్రెస్‌మీట్ మరో సెల్ఫ్ గోల్ అయిందా..?

విశాఖ విమానాశ్రయంలో … కోడి కత్తి దాడి ఘటన తర్వాత.. జగన్ నేటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అయితే.. ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరే ముందు తల్లి విజయలక్ష్మితో ప్రెస్‌మీట్ పెట్టించారు. సహజంగా ఆమె రాజకీయ నాయకురాలు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో.. రాజకీయ నేత అవతారం ఎత్తాల్సి వచ్చింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ… ఇప్పుడు కానీ.. ఏం మాట్లాడాలని చెప్పి పంపుతారో.. అదే మాట్లాడుతారు. నిన్న కోడి కత్తి ఘటనపై.. ప్రెస్‌మీట్‌లోనూ… పార్టీ నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చెప్పేసి ఉంటే సరిపోయేది. కానీ అంతకు మించి స్పందించడంతో.. మొత్తానికే తేడా పడిపోయింది. వ్యవహారం ఆన్‌లైన్‌కి చేరిపోయింది. కోడి కత్తి దాడి ఘటన వెనుక.. జగన్ ఏముకున్నారో… విజయమ్మ ఏమనుకున్నారో.. అసలు వైసీపీ దాన్ని ఎలా రాజకీయం చేయాలనుకుందో… వైరల్‌గా మారిపోయింది.

” కత్తితో దాడి చేసిన వ్యక్తి అప్పటి వరకూ మా పార్టీ వ్యక్తేనని తెలియదు. ఎవరో పిచ్చోడు.. ఏదో చేశాడని.. జగన్ అనుకున్నాడు..” అని… వైఎస్ విజయమ్మ మీడియా ముందు ఫ్లోలో అనేశారు. దాంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే… దాడి జరిగిన గంటలో… డీజీపీ కూడా అదే చెప్పారు. జగన్ అభిమాని అని.. పబ్లిసిటీ కోసం చేశాడని.. చెప్పారు. దాన్నే వైసీపీ పెద్ద రాజకీయం చేసింది. ఆ కోడి కత్తి ఘటనను నేరుగా.. చంద్రబాబుకు ఆపాదించేందుకు.. చాలా పెద్ద ప్రయత్నమే చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయి.. అక్కడ ఆస్పత్రిలో చేరి .. దాదాపుగా పదిహేను రోజులు బయటకు రాకుండా… చేసిన రాజకీయం … పకడ్బందీ ప్లానేనని.. విజయమ్మ వ్యాఖ్యలతో తేలిపోయింది.

ఎవరో పిచ్చోడు చేశాడన్న అభిప్రాయంతో జగనే ఉన్నారనేది.. ఆ ఘటన జరిగిన తర్వాత జగన్ బాడీ లాంగ్వేజ్ ను చూస్తే అర్థమైపోతుంది. కానీ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ప్లాన్ మార్చారు. ఇప్పటికీ.. జగన్ మీడియా… ఆ జగన్ అభిమాని వెనుక.. చాలా పెద్ద ముఠా ఉందని చెప్పడానికి… చిత్రవిచిత్రమైన కథనాలు అల్లుతూనే ఉంటుంది. అందులో లాజిక్కులు ఉండవు. అలా రాసుకుంటారంతే. కానీ ఈ కేసు విషయంలో… బాధితుడైన జగన్ వ్యవహరించిన తీరు.. కోర్టుల్ని సైతం… విస్మపరిచింది. అందుకే… సానుభూతి రావాల్సింది పోయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అందేనా.. ఇప్పుడు విజయమ్మ కూడా.. అసలు విషయాన్ని అన్యాపదేశంగానైనా బయటపెట్టడంతో… ఈ వ్యవహారం మొత్తం.. ఓ సెల్ఫ్ గోల్‌గా మారిపోయింది. వైసీపీని ప్రజల్లో మరిత చులకన చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close