వ‌చ్చే నెల‌లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. వైకాపా పాత్రేంటి?

వ‌చ్చే నెల ఆరో తేదీ నుంచి ప‌దిరోజుల‌పాటు ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌బోతున్నారు. ఒక‌వేళ ముంద‌స్తు ఎన్నిక‌లంటూ ఉంటే… ఇదే చివ‌రి స‌మావేశాలు అనుకోవ‌చ్చు. అలాంటి ప‌రిస్థితి లేక‌పోతే ఫిబ్ర‌వ‌రిలో బ‌డ్జెట్ స‌మావేశాలు ఉంటాయి. ఈ ద‌ఫా కూడా గ‌త స‌మావేశాలు మాదిరిగానే అధికార పార్టీ టీడీపీ పూర్తిగా ఏక‌ప‌క్షంగా నిర్వ‌హించే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివ‌రించ‌డంతోపాటు… ప్ర‌త్యేక ప్యాకేజీ కాద‌ని, హోదా కోసం పోరాటం ఎందుకు చేయాల్సి వ‌స్తోందో మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు చెప్పుకునే అవ‌కాశంగానే ఈ స‌మావేశాల‌ను వినియోగించుకుంటుంది. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌నే అజెండాను తాజా స‌మావేశాల కోసం అధికార పార్టీ త‌యారు చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

ఇక‌, ప్ర‌తిప‌క్ష వైకాపా ఈ స‌మావేశాల‌కు కూడా హాజ‌ర‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు! ఇప్ప‌టికీ, పాత‌పాటే పాడుతూ.. ప్ర‌జ‌ల్లో ఉంటూనే స‌మ‌స్య‌ల‌పై పోరాటం అనే వైఖ‌రే క‌నిపిస్తోంది. నిజానికి, క‌నీసం ఇప్పుడైనా ఆ నిర్ణ‌యాన్ని కాస్త ప‌క్క‌నపెట్టి స‌భ‌కు వ‌స్తే అన్ని ర‌కాలుగా వైకాపాకి ప్ల‌స్ అయ్యే అవ‌కాశమే ఉంటుంది. అసెంబ్లీకి హాజ‌రుకాక‌పోవ‌డం ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ కు మైన‌స్సే అవుతోంది. పైగా, ఎంపీల‌తో రాజీనామాలు చేయించి ఏమీ సాధించ‌లేక‌పోయార‌నే ఇమేజ్ ప్ర‌స్తుతం వైకాపాని ఇబ్బంది పెడుతున్న అంశం. కీల‌క స‌మ‌యంలో పార్ల‌మెంటులో త‌మ వాణిని వినిపించ‌డంలో జ‌గ‌న్ పార్టీ ఫెయిలంద‌నే చ‌ర్చ బాగానే జ‌రిగింది. దీంతో, తాజా అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో వైకాపా గైర్హాజ‌రీపై మ‌రోసారి చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. గ‌డ‌చిన సెష‌న్స్ కి దూరంగా ఉండ‌టం వ‌ల్ల వైకాపా ఏం సాధించింద‌నే చ‌ర్చ‌కూ మ‌రింత ఆస్కారం క‌నిపిస్తోంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌భ‌లో లేక‌పోవ‌డాన్ని భాజ‌పా కొంత అడ్వాంటేజ్ గా తీసుకునే అవ‌కాశం ఉంది. వారికి స‌రైన సంఖ్యాబ‌లం లేక‌పోయినా, ఉన్న కొద్దిమంది స‌భ్యులూ గ‌త స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించారు. పైగా, కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం పెట్టిన త‌రువాత జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాలు కాబ‌ట్టి… ఈసారి భాజ‌పా స‌భ్యుల మ‌రింత ప్రిపేర్డ్ గా స‌భ‌కు వస్తారు. ఏదేమైనా, తాజా స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాత్ర ఏంట‌నేది ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయం అవుతుంది. స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించ‌డం వ‌ల్ల వైకాపా ఇన్నాళ్ల‌లో సాధించింది ఏంట‌నేది ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close