ఇషాన్ హిట్‌… పూరి ఫ్లాప్‌

`రోగ్‌`తో పూరి జాత‌కం మార‌బోతోంది అనుకొన్నవాళ్లంతా నిరాశ ప‌డ్డారు. పూరీ ఏం మార‌లేదు. అత‌న్నుంచి వ‌చ్చిన సినిమా ఫ‌లిత‌మూ మార‌లేదు. క‌థ‌, క‌థ‌నాల‌పై పూరి దృష్టి పెట్ట‌క‌పోవ‌డం, ఒరేక‌ర‌మైన క్యారెక్ట‌రైజేష‌న్ల‌ను న‌మ్ముకోవ‌డం పూరిలో బ‌లంగా క‌నిపిస్తున్న బ‌ల‌హీన‌త‌లు. దాన్ని దాటుకొని రాలేక‌పోతున్నాడు పూరి. రోగ్ విష‌యానికొస్తే.. సెకండాఫ్ బాగా ఇబ్బంది పెట్టింది. త‌న‌లోని ద‌ర్శ‌కుడూ గుర్రుపెట్టి బొజ్జున్నాడు. దాంతో… పూరిని విమ‌ర్శించే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. `రోగ్‌` ఇలా తీస్తే… రేప్పొద్దుట బాల‌య్య సినిమా ఏంట‌న్న భ‌యాలు మొద‌లైపోయాయి. `రోగ్`తో ద‌ర్శ‌కుడిగా పూరి ఫ్లాప్ అయితే… ఒక్క‌డికి మాత్రం ఈ సినిమా క‌లిసొచ్చింది.. త‌నే ఇషాన్‌.

ఈమ‌ధ్య‌కాలంలో డెబ్యూ సినిమాలోనే ఇంత పెర్‌ఫార్మ్సెన్స్ ఇచ్చిన క‌థానాయ‌కుడు ఇషానే. ఆఖిరికి అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న అఖిల్ కూడా ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో తేలిపోయాడు. ఇషాన్‌లో స్టార్ అయ్యే ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. త‌న ఈజ్‌, డైలాగ్ డెలివ‌రీ.. అన్నింటికంటే మించి లుక్స్.. ఇవ‌న్నీ బాగున్నాయి. యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ‌ల‌కు బాగా సూట‌వుతాడు. నిర్మాత మ‌నోహర్ కూడా పూరి నుంచి హిట్ సినిమా ఆశించి ఉండ‌క‌పోవొచ్చు. త‌న త‌మ్ముడి టాలెంట్‌కి పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయ‌డానికి ఓ వేదిక కావాల‌నుకొని ఉంటాడు. దానికి త‌గ్గ‌ట్టుగా పూరి కూడా ఇషాన్‌ని ఓ రేంజ్‌లో చూపించాడు. రోగ్ త‌ర‌వాత‌… పూరిపై న‌మ్మ‌కాలు తిరోగ‌మ‌న స్థాయిలో వెళ్తే… ఇషాన్‌కి కొత్త అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close