రేవంత్ ఇంట్లో అడుగడుగు సోదా..! అసలు కేసేంటో..?

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో మరో రోజు సోదాలు జరపనున్నారు ఐటీ అధికారులు. 20 గంటలుగా రేవంత్‌రెడ్డిని దగ్గర పెట్టుకుని.. ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఉదయం రేవంత్‌రెడ్డి భార్య గీతను బ్యాంకులకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించి, పరిశీలించారు 3 బ్యాంకుల్లో లాకర్ల వివరాలు తెలుసుకున్నారు. డాక్యుమెంట్లు, సంతకాలు, ఇతర వ్యవహారాలపై వివరాలు తెలుసుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లాకర్ల సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఇంట్లోని హార్డ్‌డిస్క్‌లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌ పరిశోధనల నిమిత్తం ఎఫ్ఎస్‌ఎల్‌కు తరలించారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో మూడురోజులు సోదాలు నిర్వహించేందుకు…అధికారులు సెర్చ్‌ వారెంట్‌ తీసుకున్నారు.

అసలు రేవంత్ రెడ్డిపై ఉన్న ఫిర్యాదులేమిటి.. ఏ అంశంపై.. సోదాలు నిర్వహిస్తున్నారన్నదానిపై సోదాలు చేస్తున్న ఐటీ, ఈడీ వర్గాలు ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. అసలు రేవంత్ పై ఉన్న అభియోగాలేమిటి..? ఏ కేసుల్లో ఆయన ఇంటిపై దాడులు చేశారా..? అన్నదానిపై.. ఐటీ శాఖ నుంచి కానీ.. ఈడీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే.. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్న సెబాస్టియన్, ఉదయసింహా ఇళ్లలో నిన్న సోదాలు చేశారు. ఈ రోజు ఉదయ్‌సింహాకు ఫోన్‌ చేసి రేవంత్‌ నివాసానికి పిలిపించారు. రేవంత్‌రెడ్డితో పాటు ఉదయ్‌సింహాను విచారిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా.. ఓటుకు నోటు కేసు విషయంలోనే ఐటీ, ఈడీ అధికారులుసోదాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరో వైపు రేవంత్ పై ఫిర్యాదు చేసిన రామారావు అనే లాయర్ కొన్ని పత్రాలను మీడియాకు ఇస్తున్నారు. రేవంత్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రూ. 300 కోట్లు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు తాను తేల్చానని చెబుతున్నారు. ఏవేవో డాక్యుమెంట్లు ఇస్తున్నారు. అయితే కొసమెరుపేమిటంటే.. ఆ రామారావు అనే లాయర్ పై … 32 కేసులు ఉన్నాయి. సెంట్రల్ వర్శిటీ ఉద్యోగుల భూముల్ని కూడా కబ్జా చేశారు.హైకోర్టుల్లో పిటిషన్లు వేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటం ఆయన హాబీ. పోలీసులు ఆయన తీరుపై విసిగిపోయి రౌడీషీట్ ఓపెన్ చేశారు. రేపోమాపో పీడీయాక్ట్ పెట్టాలనుకుంటున్నారు. మరో వైపు రోజంతా కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ ఇంటి వద్దకు వచ్చి… సంఘిభావం తెలియజేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close