ముంచేస్తున్న “హైదరాబాద్ కంపెనీ” హవాలా విరాళాలు..!

కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీపై ఐటీ, ఈడీ జరిపిన దాడులకు సంబంధించి… దొరికిన ఆధారాలతో అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా.. ఆ కంపెనీపై.. మెగా సోదాలు నిర్వహించారు.. ఐటీ అధికారులు. దాదాపుగా.. పది రోజులు జరిగిన సోదాల్లో.. అతి పెద్ద హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలు కనిపెట్టామని.. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ … ప్రకటన కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ సంస్థ రూ. 170 కోట్లు పంపిందన్న ప్రచారం మీడియాలో జరిగింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్యుడికి మరో రూ. 150 కోట్ల వరకూ చెల్లింపులు చేసినట్లుగా సీబీడీటీ ప్రకటించింది.

ఇప్పుడు.. ఆ డబ్బులు అందుకున్న వారికి నోటీసులు జారీ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రూ. 170 కోట్లు అందినట్లుగా ఆధారాలు లభించడంతో… ఆ పార్టీకి.. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లుగా… తెలుస్తోంది. ఈ మేరకు.. ఇంగ్లిష్ చానల్ టైమ్స్ నౌ… ఈ వివరాలను ప్రకటించింది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నుంచి ఏఐసిసికి రూ. 170 కోట్లు అందాయని.. అది హవాలా మార్గంలో వచ్చినట్లుగా తెలిసిందని.. ఆ లావాదేవీల గురించి చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ డబ్బును ఏఐసిసి తన లెక్కల్లో చూపించిందా..? ఎలా ఖర్చు చేశారు అన్న వివరాలు చెప్పాలని కోరింది.

ఆ హైదరాబాద్ సంస్థ… తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు సన్నిహితుడు. ఎన్నికల సమయంలో… తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు చెందిన డబ్బే… కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. ఓ ముఖ్యుడు రూ. 150 కోట్లు అమ్ముకున్నట్లుగా కఇప్పటికీ ఐటీ అధికారులు చెప్పడంతో.. ఆయనకు కూడా త్వరలో నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close