“ఫామ్ -7” ఫెయిల్.. ఇప్పుడు “సీ విజల్‌” వంతు..!

“తెలుగేదశం పార్టీ అక్రమాలపై.. సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయండి. డబ్బుల పంపిణీపై ఎక్కడిక్కడ ఫిర్యాదు చేయండి..” అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా సభల్లో చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే అక్రమాలపై ఓటర్లు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం ఈ యాప్‌ను రూపొందించింది. అక్రమాలపై ఫిర్యాదు చేయాలనడం బాగుంది కానీ.. ప్రతి టీడీపీ నేత ఇల్లు సోదాలు చేయాలని ఫిర్యాదులు చేయడమే అనూహ్యం. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు.. సీ విజిల్‌లో అదే చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం అభ్యర్థి, బంధువులు పేర్లు, అడ్రస్సులు పెట్టి.. వారింట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని ఓ కంప్లయింట్ పడేస్తున్నారు. ముందుగా మాట్లాడుకున్నారో లేక… యాధృచ్చికమో కానీ.. ఎలాంటి ఆధారాలు .. ఆ ఫిర్యాదుల్లో లేకపోయినా టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు సిద్ధమవుతున్నారు.

నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ… నారాయణ కాలేజీల అధినేత. ఆయన నివారం నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే ఉంటుంది. నిన్న ఐటీ అధికారులు ఒక్క సారిగా.. ఆ ఇంటితో పాటు మెడికల్ కాలేజీపై విరుచుకుపడ్డారు. మూడు గంటల పాటు హడావుడి చేశారు. మొత్తం వెదికారు. ఆనక తీరిగ్గా.. ఏమీ దొరకలేదని వెళ్లిపోయారు. నారాయణ ఇంట్లో వందల కోట్ల రూపాయల క్యాష్ ఉందని.. తమకు సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు వచ్చిందని.. వారు తీరిగ్గా చెప్పారు. ఎన్నికల్లో పంచేందుకు నారాయణ కాలేజీలో… రూ.వందల కోట్లు దాచిపెట్టినట్టు సీవిజిల్‌కు ఫిర్యాదు వచ్చిందంన్నారు. సీవిజిల్‌కు అందిన ఫిర్యాదులో నిజం లేదని నిర్థారించుకున్నారట.

టీడీపీ నేతలపై ఐటీ దాడులకు రంగం సిద్ధం చేస్తున్నారని.. ఎన్ని బెదిరిచినా భయపడబోమని.. చంద్రబాబు.. విజయనగరంలో వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే.. ఈ దాడులు జరగడంతో కలకలం రేగింది. సాధారణంగా ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు ఆర్థిక మద్దతు లేకుండా చేయడానికి బీజేపీ చేసే టెక్నిక్ ఇదే. తమ పార్టీపై కానీ.. తమ పార్టీ మిత్రపక్షాలపై కానీ.. ఒక్క ఐటీ దాడి జరగదు. కానీ ప్రత్యర్థి పార్టీల నేతలపై.. మాత్రం… దాడులు చేయడానికి ఓ టీం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. కర్ణాటక ఎన్నికల్లో అదే జరిగింది. ఏపీలోనూ అదే జరగబోతోందని చెబుతున్నారు. దానికి ఇప్పుడు గొప్ప అవకాశంగా “సీ విజిల్‌” యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close