‘శైలజారెడ్డి అల్లుడు’ & టీమ్… ముందు ఫేక్ అనడం ఎందుకో?

‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. సారీ… ఫస్ట్ లుక్స్ అనాలేమో. ఎందుకంటే.. రెండు పోస్టర్స్ విడుదల చేశారు. హీరో నాగచైతన్య సోలో లుక్ ఒకటి. సినిమాలో అత్త పాత్రకున్న ప్రాముఖ్యత తెలియచెప్పేలా రమ్యకృష్ణ సీరియస్‌గా కూర్చోగా వెనుక నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ నవ్వుతూ నిలబడ్డ లుక్ మరొకటి. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి… లుక్స్ రెండూ సూపర్బ్. నాగచైతన్య హ్యాండ్సమ్‌గా వున్నాడు. రమ్యకృష్ణ, అనూ ఇమ్మాన్యుయేల్ తమ తమ లుక్స్‌తో ఆకట్టుకున్నారు.

అయితే… చైతన్య సోలో లుక్ చూస్తే వారం రోజుల క్రితం ‘శైలజారెడ్డి అల్లుడు’ & టీమ్ ఫేక్ అని క్లారిటీ ఇచ్చిన లుక్ గుర్తుకు రావడం ఖాయం. అందులోనూ, ఇందులోనూ చైతన్యది సేమ్ డ్రెస్. టైటిల్‌ లోగోలో ‘అల్లుడు’ ఫాంట్ సేమ్. ‘శైలజారెడ్డి’ ఫాంట్ స్టైల్ మారింది. చైతన్య స్టిల్ ఇచ్చిన పోజ్ మారింది. సేమ్ లొకేషన్‌లో తీసిన ఫోటోలు అని ఈజీగా అర్థమవుతుంది. ఈమాత్రం దానికి నిర్మాతలు ఫేక్ అని క్లారిటీ ఇవ్వడం ఎందుకో? ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు లీకేజీల బెడద తప్పడం లేదు. స్టిల్ ఎవరో లీక్ చేశారు… వారంలో ఇంతకంటే మంచి స్టిల్ రిలీజ్ చేస్తామని చెబితే సరిపోయేది. లేదా నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ వున్న స్టిల్ విడుదల చేసినా బావుండేది. ఏది అయితే ఫేక్ అని చెప్పారో… సేమ్ స్టైల్‌లో మరొకటి విడుదల చేయడం ఎందుకో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close