నాగబాబు – రోజా… మ‌ధ్య‌లో న‌లిగిపోతున్న ‘జ‌బ‌ర్‌ద‌స్త్‌’

కార‌ణాల ఏమైనా గానీ జ‌బ‌ర్‌ద‌స్త్ నుంచి నాగ‌బాబు వెళ్లిపోయారు. ఆయ‌న లేకుండానే షోలు జ‌రిగిపోతున్నాయి. నాగ‌బాబుతో పాటు కొంత‌మంది జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ స‌భ్యులు కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోయే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఛ‌మ్మ‌క్ చంద్ర‌, ఆర్‌పీ లాంటివాళ్లు జ‌బ‌ర్‌ద‌స్త్‌కి గుడ్‌బై చెప్పేశారు. మిగిలిన వాళ్లూ ఆ దారిలోనే వెళ్తార‌నుకున్నారు. కానీ.. అదేం జ‌ర‌గ‌లేదు. నాగ‌బాబుకి అత్యంత స‌న్నిహితంగా ఉండే సుడిగాలి సుధీర్ టీమ్ కూడా.. జ‌బ‌ర్‌ద‌స్త్‌ని వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్లలేదు. ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ స‌భ్యులంద‌రినీ ఇంటికి పిలిచి చిన్న సైజు మీటింగు పెట్టార‌ని స‌మాచారం. మ‌ల్లెమాల‌నీ, ఈటీవీనీ వ‌దిలేసి ర‌మ్మ‌ని వార్నింగ్‌లాంటిది ఇచ్చార్ట‌.

మ‌రోవైపు రోజా కూడా మ‌రో మీటింగ్ పెట్టింద‌ట‌. `మీకు జీవితం ఇచ్చిందే జ‌బ‌ర్‌ద‌స్త్‌. దాన్ని వ‌దిలి వెళ్తే మీకు విశ్వాసం లేన‌ట్టే` అంటూ ఎమోషన‌ల్ బ్లాక్ మెయిల్ చేస్తోంద‌ట‌. మ‌రి నాగబాబు మాట వినాలా? రోజా మాట వినాలా? అనేది ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. జ‌బ‌ర్‌ద‌స్త్‌లోని స‌భ్యులంద‌రికీ ఈ షో వ‌ల్లే లైఫ్ వ‌చ్చింది. అది కాద‌న‌లేని స‌త్యం. చాలామంది సొంతిళ్లు కొనుక్కుని సెటిల్ అయిపోయారు. సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా రాక‌పోయినా, జ‌బ‌ర్‌ద‌స్త్ చేసుకుంటూ వెళ్తే చాలు. వాళ్ల కెరీర్‌కి ఢోకా ఉండ‌దు. అందుకే… జ‌బ‌ర్‌ద‌స్త్‌ని వ‌దిలివెళ్ల‌డానికి ఎవ్వ‌రూ స‌ముఖంగా లేర‌ని తెలుస్తోంది. ఛ‌మ్మ‌క్ చంద్ర‌, ఆర్పీలు కూడా మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. త‌న మాట విన‌క‌పోవ‌డంతో నాగ‌బాబు ఈగో హ‌ర్ట‌య్యింద‌ని, ఆయ‌న‌కు స‌మాధానం చెప్ప‌లేక జ‌బ‌ర్‌ద‌స్త్ టీమ్ లీడ‌ర్లు తెగ ఇబ్బంది పెడుతున్నార‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close