ఇడుపుల పాయలో కలివిడిగా జగన్, షర్మిల !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపుల పాయలో వైఎస్ కుటుంబం అంతా దాదాపుగా ఒక్కటిగా కనిపించింది. వైఎస్ సునీత మినహా మిగిలిన వారు అందరూ కలిసే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. సీఎం జగన్‌తో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పక్క పక్కనే కూర్చున్నారు. మాట్లాడుకున్నారు. అయితే ఓ సందర్భంలో పక్కన వ్యక్తి ఇచ్చిన పేపర్‌ను షర్మిల జగన్‌కు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అది షర్మిల ఇస్తున్నారని అనుకున్నారేమో కానీ.. జగన్ తీుకోలేదు . వద్దని చెప్పేశారు.

దాంతో షర్మిల ఆ పేపర్‌ను వెనక్కి ఇచ్చేశారు. ఇదొక్కటి మినహా మిగతా అంతా కుటుంబంలో ఏ వివాదాలు లేనట్లుగా కార్యక్రమం జరిగిపోయింది. ప్రతీ సారి వైఎస్ జయంతి లేదా వర్థంతి సందర్భంగా వేర్వేరుగా నివాళులు అర్పిస్తూ వస్తున్నారు. కొన్నిసందర్భాల్లో ఒకే సారి నివాళులు అర్పించినా మాట్లాడుకోవడం లేదు. కుటుంబంలో వివాదాలు పెరిగిపోయాయని ఈ కారణంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా కూడా జగన్, షర్మిల కలుసుకోవడం లేదు.

సోషల్ మీడియా ద్వారా కూడా జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ పరిణామాలన్నీ ఇతర పార్టీల నేతలకు అస్త్రంగా మారాయి. అదే సమయంలో పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేయడంతో .. ఈ చర్చలు మరింత పెరిగాయి. వాటికి చెక్ పెట్టేందుకు వైఎస్ వర్థంతి సందర్భంగా నివాళి కార్యక్రమం ఉపయోగపడినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close