న్యాయం, ధర్మానిదే గెలుపు…..గెలిచిందెవరు జగన్?

రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి కూడా వైఎస్ జగన్ నోటి వెంట కొన్ని రెగ్యులర్ వాక్యాలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. ‘న్యాయం, ధర్మానిదే గెలుపు’ అన్న డైలాగ్ అందులో ఒకటి. మరి అదే నిజమైతే 2014లో గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు? టిడిపి అధినేత చంద్రబాబు గెలుపును వైఎస్ జగన్ ఒప్పుకునే ఛాన్సేలేదు. కానీ అది అందరికీ తెలిసిన నిజం. అబద్ధపు హామీలు ఎన్నో చెప్పాడు, మాటల్లో అద్భుతమైన ప్రపంచాన్ని చూపించి మోసం చేశాడు, నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్‌ల సపోర్ట్‌ తోడయ్యింది, అనుకూల మీడియా కూడా చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మించడంలో సక్సెస్ అయింది….అందుకే చంద్రబాబు గెలిచాడు…అంతేకానీ అది చంద్రబాబు గెలుపు కాదు అనే మాటలు వైసిపి నాయకులు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఎలా గెలిచాడు అన్న విషయం పక్కన పెడితే గెలిచింది మాత్రం చంద్రబాబే. ఓడిపోయింది జగనే. మరి ‘న్యాయం, ధర్మమే గెలుస్తుందని జగన్ చెప్పే మాట ప్రకారమే అయితే ఆ న్యాయం, ధర్మం చంద్రబాబు వైపు ఉన్నట్టే లెక్క.

వైఎస్ జగన్ ప్రసంగాల్లో ఇదొక్కటే కాదు…..ఆయన చెప్పే చాలా పాయింట్లు ఆయనకే తగులుతూ ఉంటాయి. అలాగే భారతదేశంలో ఉన్న నాయకులందరిలోకి ఒక్క చంద్రబాబుని మాత్రమే అవినీతిపరుడు, అబద్ధపు హామీలతో పవర్‌లోకి వచ్చిన వాడిగా చూస్తాడు జగన్. ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పింది చంద్రబాబు..ఇస్తానని చెప్పింది నరేంద్రమోడీ. అయినప్పటికీ జగన్‌కి మాత్రం చంద్రబాబు తప్పు మాత్రమే కనిపిస్తుంది. ఇక జగన్ స్పీచ్‌లలో బంగాళా ఖాతంలో కలిపెయ్యండి అనే ఇంకో రెగ్యులర్ డైలాగ్ కూడా ఉంటుంది. ఆ బంగాళాఖాతం ఒడ్డునే ఉన్న ఓటర్లే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిని నిజంగానే బంగాళాఖాతంలో కలిపేశారన్న వాస్తవాన్ని మర్చిపోతూ ఉంటాడు జగన్. ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలు ఒకె గానీ పార్టీ పెట్టినప్పటి నుంచీ ఒకే రకమైన మాటలతో బోర్ కొట్టిస్తున్న వైఎస్ జగన్. కాస్త కొత్తగా ట్రై చే్స్తే బాగుంటుందేమో. అలాగే నేను ముఖ్యమంత్రిని అయితే తప్ప రామరాజ్యం వచ్చినట్టుగా కాదు అనే కాన్ఫిడెన్స్ కూడా జగన్‌లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఏ సమస్యకు సంబంధించిన ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించినా….రెండేళ్ళలో మన ప్రభుత్వం వస్తుంది….అన్నీ అద్భుతాలే జరిగిపోతాయి అని చెప్పడం కూడా కాస్త తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గద్దెనెక్కిన చంద్రబాబు, నరేంద్రమోడీలు…వాళ్ళను గద్దెనెక్కించిన పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ ప్రచారం చేసి పెట్టిన టిడిపి అనుకూల మీడియాలు చూపించింది కూడా అలాంటి అద్భుతాలే. ఇప్పుడు మళ్ళీ జగన్ కూడా అదే స్టైల్‌ని ఫాలో అవుతూ…చంద్రబాబును దింపెయ్యండి…నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి…అద్భుతాలే చూపిస్తా అని చెప్తూ ఉంటే జనాలకు 2014లో చంద్రబాబు, మోడీలు చూపించిన సినిమా గుర్తొస్తుంది. అదే జరిగితే మాత్రం…..ఏ రాయి అయితే ఏముంది….అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే వాగాడంబరం కట్టిపెట్టి కాస్త వాస్తవికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. అయినా ఎంబిఎ గ్రాడ్యుయేట్‌ని, యువనేతని, సరికొత్త రాజకీయాలకు ప్రతినిధిని అని మాటలు చెప్పే జగన్…..చేతల్లో మాత్రం అవే చింతకాయపచ్చడి రాజకీయ పద్ధతులను ఫాలో అవడం……పదేళ్ళ క్రితం సక్సెస్ అయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రసంగ శైలిని అనుకరిండం ఏంటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close