పవన్ “ముట్టడి”కి మొత్తం జగన్ కేబినెట్ షేక్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్క రోజు.. విజయవాడ నుంచి మచిలీపట్నం నుంచి ర్యాలీ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు… మొత్తం ఏపీ కేబినెట్ అంతా స్పందించింది. ముఖ్యంగా అసెంబ్లీని ముట్టడిస్తామని ఇచ్చిన పిలుపు.. ప్రభుత్వానికి సూటిగా తగిలింది. ముఖ్యమంత్రి దగ్గర్నుంచి ఆదిమూలపు సురేష్ వరకూ ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా.. రాజకీయంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను కించ పరిచేందుకే.. ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ కల్యాణ్ రైతు పోరాటాన్ని ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు చెబితే చేస్తున్నాడన్నట్లుగా చెప్పుకొచ్చారు. వారికి రైతులపై ప్రేమ లేదన్నారు. ఆయన మంత్రులు మాత్రం.. వైసీపీ బ్రాండ్‌కు ఏ మాత్రం తగ్గకుండా.. పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. మంత్రి పేర్ని నాని .. పవన్ ను చిడతల నాయుడు అని అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. చిడతలు కొట్టడానికి కూడా డబ్బులు సంపాదిస్తాడని మండిపడ్డారు.

పేర్ని నాని ఇలా అనడానికి కారణం.. మచిలీపట్నంలో పవన్ కల్యాణ్… చిడతలు కొట్టడం ఆపి పని చేయాలని.. నానికి సూచించారు. అందుకే.. తాను చిడతలు కొట్టడం లేదని.,. పవనే కొడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే.. తాను చేసేదానికి స్వామిభక్తి అనే పేరు పెట్టుకున్నారు. తనది స్వామి భక్తి అని.. తను చనిపోయేటప్పుడు కూడా వైఎస్ జపం చేస్తానని చెప్పుకొచ్చారు. పేర్ని నాని మాత్రమే కాదు కొడాలి నాని కూడా.. ఘాటుగా స్పందించారు. ప్యాకేజీలు తీసుకుని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్ల్ అని నిందించారు. మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సినిమాల్లో పేమెంట్ తీసుకుని ఎలా నటిస్తున్నారో.. రాజకీయాల్లో కూడా అలానే నటిస్తున్నారన్నారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్‌ పర్యటనలని… అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తారో చెప్పాలని పీఆర్పీ నుంచి రాజకీయ జీవితం పొందిన అవంతి ప్రశ్నించారు. గత ప్రభుత్వం రుణమాఫీ పై ఎలా స్పందించారని.. కోవిడ్ సమయంలో పవన్ ఎక్కడికెళ్లారో చెప్పాలని మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి డిమాండ్ చేశారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేక పోయిన పవన్ కల్యాణ్… రాజకీయాలకు ఏం పనికి వస్తారని.. మంత్రి ఆదిమూలపు సురేష్‌ తేలిగ్గా తీసుకున్నారు.

రాజకీయం అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ కాదని .. రాజకీయాల్లో ఉండాలంటే పాదయాత్ర చేయాలని సవాల్ చేశారు. అందరూ.. అసెంబ్లీ ముట్టడికి పవన్ ఇస్తామన్న పిలుపును ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను వైసీపీ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో.. మొత్తం కేబినెట్ ఆయనపై ఎదురుదాడి చేయడానికి రెడీ కావడంతోనే తేలిపోయిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ జనంలోకి వస్తే వచ్చే స్పందన ఎలా ఉంటుందో కళ్ల ముందు కనిపించంది కాబట్టే… ప్రభుత్వం… మూకుమ్మడి ఎటాక్ చేసి.. పవన్ కల్యాణ్ ను.. కంట్రోల్ చేయాలనుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ వేడిని తగ్గించకుండా… మరింత ఘాటుగా ప్రభుత్వంపై పోరాడాలన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close