రెండున్న‌రేళ్లు కూడా వారికి వృథాయేనా? జ‌గ‌న్ స‌ర్కారులో కొత్త చ‌ర్చ‌

మొత్తం 25 మందితో కొలువుదీరిన ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు.. ఈ వంద రోజుల పాల‌నా కాలాన్ని భేరీజు వేసే ప‌నిలో ప‌డింది. మంత్రుల‌పై కూడా ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టిన సీఎం జ‌గ‌న్‌.. వారి ప‌నితీరుపై నిఘావ‌ర్గాల నుంచి నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు. తాను ప‌నిగ‌ట్టుకుని దేశంలోనే తొలిసారిగా ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాల‌కు, మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశారు. వీరికి ఆరోజు చెప్పిన దాని ప్ర‌కారం రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఇచ్చారు. ఈ రెండున్న‌రేళ్ల కాలాన్ని స‌ద్వినియోగం చేసుకుని పాల‌న‌కు సంబంధించి మెరుపు మెరిపించాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

అయితే, ఇప్పుడు జ‌గ‌న్ అందిన నివేదికల ప్ర‌కారం దాదాపు ఆరు నుంచి ఏడుగురు మంత్రులు కేవ‌లం ప‌దవుల్లో ఉన్నారే త‌ప్ప ప‌నివిష‌యంలో పెద్ద‌గా దూకుడు ప్ర‌ద‌ర్శించింది కానీ జ‌గ‌న్ ఆశ‌ల మేర‌కు న‌డుచుకుంటున్న‌ది కానీ లేద‌ని స్ప‌ష్టంగా తెలిసిపోయింది. వీరిలో మైనార్టీ మంత్రి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎస్టీ వ‌ర్గానికి చెందిన గిరిజ‌న మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప‌శ్రీవాణి, రోడ్లు, భ‌వ‌నాల మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, సంక్షేమ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌, ఎక్సైజ్ మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి, మ‌హిళా శిశు సంక్షేమ మంత్రి తానేటి వ‌నిత‌, కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం, బీసీ మంత్రి మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌ల‌పై ప‌లు నివేదిక‌లు వ‌చ్చాయి.

వీరంతా కూడా ప‌నిలేకుండా ఉన్నార‌నేది సారాంశం. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా వీరుఎక్క‌డా కౌంట‌ర్లు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం, ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డం వంటివి కూడా నివేదిక‌లో పేర్కొన్న‌ట్టు తెలిసింది. ఇలాంటి వారి స్థానంలో ఒక‌రిద్ద‌రు ఫైర్ బ్రాండ్ల‌కు ఈ ప‌ద‌వులు ఇచ్చి ఉంటే బాగుండేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్ప‌టికే నియ‌మించిన మంత్రుల‌ను రెండున్న‌రేళ్ల వ‌ర‌కు మార్చేదిలేద‌నే సంకేతాలు జ‌గ‌న్ పూర్వ‌మే ఇచ్చి ఉండ‌డంతో మ‌నం ఎలా ఉన్నా.. రెండున్న‌రేళ్లు ప‌ద‌వి ఖాయ‌మ‌ని వీరు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇలాంటి వారి విష‌యంలో జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close