జగన్లు ఇద్దరు..కానీ అభిప్రాయం మాత్రం ఒకటే

ఒకరు అందరికీ చిరపరిచితుడయిన వైకాపా అధ్యక్షుడు జగన్ కాగా మరొకరు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌. ఇద్దరిదీ పూర్తిగా భిన్న దృవాలయినప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇద్దరూ ఒకే రకమయిన అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం. కేసీఆర్ మోజు పడటం వలననే వరంగల్ ఉప ఎన్నికలు వచ్చేయని జగన్మోహన్ రెడ్డి అంటే, కేసీఆర్ భూస్వామ్య అహంకారానికి పరాకాష్టకి నిదర్శనంగా ఉప ఎన్నికలు వచ్చేయని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ అభిప్రాయపడ్డారు. ఈ 16 నెలల తెరాస పాలనలో పేద ప్రజలను పట్టించుకోకుండా రాష్ట్రంలో దళారీ, భూస్వామ్యవర్గాన్ని పెంచి పోషించిందని విమర్శించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ 16 నెలల పాలనలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కోసం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాయమాటలు చెపుతూ ప్రజలకు మభ్యపెడుతున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే, కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పడమే కాకుండా దళితులకు పక్కనబెట్టి, తెలంగాణా ద్రోహులకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. మావోయిష్టుల అజెండానే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెపుతూ, మావోయిష్టులను భూటకపు ఎన్కౌంటర్ చేయిస్తున్నారని మావోయిస్ట్ నేత జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పాటించని తెరాస ప్రభుత్వానికి ఈ ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇద్దరు జగనన్నలు కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర అసాంతం విపక్షాలపై ఏడుపే !

జగన్ బస్సు యాత్ర ముగిసింది. రోజు మార్చి రోజు విరామం తీసుకుంటూ.. ఓ ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేయడానికి పాతిక రోజుల సమయం తీసుకున్నారు. ఏసీ బస్సు నుంచి...

అయితే పోతిన లేకపోతే పోసాని – పిచ్చెక్కిపోతున్న వైసీపీ !

పవన్ కల్యాణ్ రాజకీయంతో వైసీపీకి దిక్కు తోచని పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై కసి తీర్చుకోవడానికి వ్యక్తిగత దూషణలు.. రూమర్స్ ప్రచారం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని ప్రతీ రోజూ రంగంలోకి తెస్తున్నారు. గతంలో పోసాని...

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close