దొరకని షా అపాయింట్‌మెంట్..! జగన్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనూహ్యంగా వాయిదా పడింది. ఆయన కలవాలనుకున్న హోంమంత్రి అమిత్ షా బిజీగా ఉండటం వల్ల.. అపాయింట్‌మెంట్ కుదరదలేదని.. అందుకే… ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్రకు తుపాను ముప్పు పొంచి ఉన్నందున దాన్ని ఎదుర్కొనే విషయాల్లో .. హోంమంత్రి తీరిక లేకుండా తుపాను తీవ్రత తగ్గిపోయిన తర్వాత మళ్లీ అపాయింట్‌మెంట్ ఇస్తామని చెప్పినట్లుగా ప్రభుతవ వర్గాలు చెబుతున్నాయి. కానీ అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారయింది.. రాత్రి పది గంటలకు. అది ఆయనకు తీరిక సమయమే. అయినప్పటికీ.. అపాయింట్‌మెంట్ రద్దు కావడం వైసీపీ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన తర్వాత అపాయింట్‌మెంట్ ఖరారు కోసం.. రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఢిల్లీ వరకూ వెళ్లకుండానే… అపాయింట్‌మెంట్ రద్దు సమాచారం అందడంతో కాస్త రిలీఫ్ దొరికినట్లయింది. గతంలో ఢిల్లీకి వెళ్లి అమిత్ షా… కోసం.. రెండు రోజుల పాటు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ అపాయింట్‌మెంట్ కూడా.. ఇలా ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఖరారు కాని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నట్లుగా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి క్షణంలో.. అమిత్ షాను కలిసే అవకాశం లేదని తేలడంతో.. పర్యటన రద్దు చేసుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వ్యవహారాలను చక్క బెడుతున్నవారు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదని.. తొందరపడి.. టూర్లను ఖరారు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రతీసారి ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్లు రద్దు కావడం.. వైసీపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని చెబుతున్నారు. నిన్నామొన్నటిదాకా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న విజయసాయిరెడ్డి కోఆర్డినేట్ చేసేవారు. ఈ సారి ఆయన ప్రమేయం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి… అపాయింట్‌మెంట్ తీసుకున్నా… అదే పరిస్థితి ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది.

కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వాలి అనుకుంటే.. పెద్ద విషయం కాదని.. రోజూఆయనను అనేక మంది కలుస్తూ ఉంటారని… కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఇలా వరుసగా జగన్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ల రద్దు వెనుక రాజకీయ కారణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. పదే పదే ఇలా జరగడం.. వైసీపీ నేతల్ని కూడా అసహనానికి గురి చేస్తోంది. ఖచ్చితంగా అపాయింట్‌్మెంట్ ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన చేస్తున్నామని.. అయితే.. ఆ తర్వాత రద్దు చేస్తున్నారని.. ఇది ఇబ్బందికరంగా మారుతోందని వారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close