పాపం జగన్…పవన్ పొలిటికల్ స్టెప్‌ని కూడా కాపీ కొట్టాల్సిన దుస్థితి

రాజకీయ ఎంట్రీ ఇస్తున్నాం…..కొత్త పార్టీ స్థాపిస్తున్నాం అని చెప్పే ప్రతి నాయకుడు కూడా ‘మాకు అధికారం ఇచ్చి చూడండి…. మార్పు తీసుకొస్తాం, కొత్తగా ఏదో చేస్తాం’ అని చెప్పేవాడే. కానీ ఆ అధికారం రాక ముందు మాత్రం వాళ్ళు చేసే ప్రతి పొలిటికల్ యాక్టివిటీ కూడా కొన్ని దశాబ్ధాలుగా అందరు నాయకులు చేస్తున్నట్టుగానే పరమ రొటీన్‌గా ఉంటుంది. వాళ్ళ రాజకీయ ప్రసంగాల నుంచీ కుల, మతాల ప్రాతిపదికన అభ్యర్థులను సెలక్ట్ చేయడం, సీటుకి ఇంత అని రేటు ఫిక్స్ చేయడం, ఓటుకు నోటు ఇవ్వడం, సారా ప్యాకెట్లు పంచడం, ఉచిత హామీలు ఇవ్వడం…….అన్నీ పాత పద్ధతులే ఫాలో అవుతూ ఉంటారు. దాదాపుగా దశాబ్ధ కాలం నుంచీ రాజకీయాల్లో ఉన్న జగన్ కూడా కొత్తగా చేసింది ఏమీ లేదు. ప్రసంగాల శైలిని కూడా వాళ్ళ నాన్న నుంచి దించేశాడు. ఓదార్పు యాత్రలకు, పరామర్శ యాత్రలకు మాత్రం బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నాడు. రాజధాని నిర్మాణం ఎలా జరగాలి అనే విషయంపైన 2014ఎన్నికలకు ముందే ఎన్నో మాటలు చెప్పాడు చంద్రబాబు. చేస్తున్నాడా? లేడా? అన్న విషయం తర్వాత కనీసం మాటలైతే చెప్పాడు. కానీ జగన్ వైపు నుంచి మాత్రం ఈ రోజుకీ కూడా రాజధానిని ఎలా నిర్మించాలి అనే విషయంపై ఒక స్పష్టమైన విధానం అంటూ ఏదీ వినిపించలేదు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు తాను అనుకుంటున్న పరిష్కారాలు ఏంటో కూడా ఎప్పుడూ చెప్పింది లేదు. చంద్రబాబును విమర్శించడం తప్ప జగన్ ఇంకేం చేస్తున్నాడంటే ఎవ్వరూ ఏమీ చెప్పలేని పరిస్థితి.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి ఓ పని చేసి చూపించాడు. దశాబ్ధాలుగా ఉన్న సమస్యే అయినా సరే……అందరూ మర్చిపోయిన ఆ సమస్యను మరోసారి అందరూ చర్చించుకునేలా చేశాడు. ఇప్పటికిప్పుడు ఉద్ధాన బాధితులందరి సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పలేం కానీ వాళ్ళకు ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు. అందుకే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్‌ని గ్రేటాంధ్రలాంటి వెబ్‌సైట్స్ మినహా అందరూ ప్రశంసించారు. జగన్ కూడా ఇప్పుడు పవన్ చూసి ఇన్‌స్పైర్ అయినట్టున్నాడు. అలాంటి ఓ సమస్యను నేనూ టేకప్ చేయాలని ఆలోచించినట్టున్నాడు. అయితే ఇక్కడ కూడా మరీ పవన్ కళ్యాణ్‌ని కాపీ కొడుతున్నట్టుగా అదే కిడ్నీ బాధితుల సమస్యనే టేకప్ చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా, కనిగిరి పరిసరాల్లో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యను హైలైట్ చేయడానికి జగన్ వెళ్తున్నాడు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నందుకు అబినందించొచ్చు కానీ మరీ పవన్ టేకప్ చేస్తున్న సమస్యలనే కాకుండా కొత్తగా కూడా ఏమైనా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కోట్లాది మంది ప్రజలు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. నాయకులు మాత్రం ఫారెన్ టూర్లు, లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ సినిమా చూపిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో విపక్ష నేతలైన జగన్, పవన్‌లు అయినా ప్రజల సమస్యలను అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటే ప్రభుత్వంలో ఎంతో కొంత స్పందన అయితే వస్తుంది. కొంతమందికి అయినా మంచి జరుగుతుంది. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలతో కాలం వెల్లిబుచ్చే రాజకీయాల కంటే ఇది కాస్త మంచి రాజకీయమే అనడంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close