పంచడానికి..అమ్మడానికి భూములే..! అవి అయిపోతే..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రభుత్వ ప్రతి పనిని భూములతో ముడి పెట్టేస్తున్నారు. ఉగాదికి పాతక లక్షల ఇళ్ల స్థలాలిచ్చేస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. సంక్షేమ పథకాల అమలు కష్టమని.. ఆర్థిక శాఖ అధికారులు సీఎం వద్దకు వెళ్లారు. వారికీ ముఖ్యమంత్రి భూముల్నే చూపించారు. బిల్డ్ ఏపీ పేరుతో భూములు అమ్మి కావాల్సినంత సొమ్ము చేసుకోమని పురమాయించారు. ఇక విశాఖకు రాజధాని మార్చడానికి ఓ ఆరు వేల ఎకరాలకు అధికారులకు ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇక పరిశ్రమలు పెడతామని వచ్చే వారికి భూములు చూపించాలని ఆదేశిస్తున్నారు. పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం 50వేల ఎకరాలు చూడాలని ఆదేశించారు. ఇంకా.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ.. ముఖ్యమంత్రి ఆదేశాలు చివరికి భూముల వద్దకే వెళ్తున్నాయి.

ప్రభుత్వ ప్రయారిటీలో కనిపిస్తున్న ప్రతి అంశంలోనూ భూములే హైలెట్ అవుతున్నాయి. అది పంచడానికైనా.. అమ్మడానికైనా.. కేటాయించడానికైనా. మరి ఇన్ని భూములు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మిస్టరీగా మారింది. పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయడానికే కొన్ని వేల ఎకరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఒక్క ఎకరం కూడా ఎక్కడా కొనుగోలు చేయలేదు. బడుగు, బలహీనవర్గాలకు గత ప్రభుత్వాలు .. ఇచ్చిన అసైన్డ్ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని వాటిని ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నారు. ఇక ఖర్చుల కోసం ఖజానా నింపుకోవడానికి ఖరీదైన.. యూనివర్శిటీ భూములు, స్టేట్‌గెస్ట్ హౌస్ లాంటి భవనాలు.. ఇతర స్థిరాస్తుల్లాంటివి అమ్మకానికి పెడుతున్నారు. ఏవేవి అమ్ముతారో.. సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఇక పరిశ్రమలకు భూములు.. విద్యుత్ ప్రాజెక్టులకు భూములు వాటి సంగతేం చేస్తారో క్లారిటీ లేదు. కానీ.. అన్నింటికీ.. భూముల వైపే ప్రభుత్వం చూపు ఉంది..

ప్రపంచంలో దేన్నైనా సృష్టించవచ్చు కానీ.. భూమిని సృష్టించలేరు. భూమి ఉత్పత్తి అనేదే ఉండదు. అందుకే.. భూమి విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. భూములు ఉండటమే ప్రభుత్వానికి భరోసా. కానీ ప్రస్తుత ప్రభుత్వం.. ఉన్న భూములన్నింటినీ ఊడ్చి పెట్టేస్తోంది. ప్రభుత్వానికి గజం భూమి లేకుండా చేస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న యూనివర్శిటీల భూములు… ఖరీదైన గెస్ట్‌హౌస్‌ల్లాంటివి కూడా అమ్మకానికి పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ప్రజా అవసరాల కోసం.. ఓ కాలేజీనో.. మరో కట్టడమో కట్టాలనుకుంటే.. భూమి ఎక్కడి నుంచి వస్తుంది..?. అప్పుడు మళ్లీ ప్రజల నుంచే సేకరించాల్సి ఉంటుంది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రైవేటు వ్యక్తుల భూముల్ని సేకరించే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ.. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఉండే భూమి ఇలా సేకరించేదే. దాన్ని అడ్డగోలుగా పంచేస్తూ.. అమ్మేస్తున్న ప్రభుత్వం తర్వాత అవసరాల కోసం మళ్లీ ప్రజల భూముల్నే సేకరిస్తుంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close