చంద్రబాబుని జగన్ డిస్టర్బ్ చేస్తున్నారుట!

ఓటుకి నోటు కేసుని వైకాపా మళ్ళీ తిరగదోడి తనని దెబ్బ తీయాలని ప్రయత్నించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆగ్రహం కలగడం సహజమే. అయితే ఆ కేసు గురించి మాట్లాడి, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే దాని గురించి మీడియాలో వార్తలు, చర్చలు మొదలయితే ఆ కేసుని స్వయంగా హైలైట్ చేసుకొన్నట్లు అవుతుంది. వైకాపా కూడా అదే కోరుకొంటోంది కనుక దానికీ తనపై దాడి చేసేందుకు బలమైన ఆయుధం అందించినట్లవుతుంది. అందుకే ఆ కేసు గురించి చంద్రబాబు చాలా ఆచితూచి క్లుప్తంగా రెండే రెండు ముక్కలు మాట్లాడి సరిపెట్టేశారు. తనకి ఈ అగ్నిపరీక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఆగ్రహం మరోవిధంగా బయటపెట్టుకొన్నారు.

కడప జిల్లాలో మాధవరం గ్రామంలో ముఖ్యమంత్రి నిన్న పర్యటించినపుడు జగన్ పై విమర్శలు తీవ్ర విమర్శలు గుప్పించారు. నేరుగా జగన్ పేరు చెప్పకపోయినా, “మీ జిల్లాలో ఒక ఉన్మాది ఉన్నాడు. అతనికి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడం తప్ప వేరే పనేమీ లేదు. అమరావతికి అడ్డుపడుతున్నాడు. చివరికి పట్టిసీమ ద్వారా రాయలసీమకి నీళ్ళు అందించాలని మేము ప్రయత్నిస్తుంటే దానికి ఆయన అడ్డుపడుతున్నాడు. దేశంలో చాలా సీనియర్ రాజకీయ నాయకుడిని నేను. దేశానికి రాష్ట్రపతిని, ప్రధాన మంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించినవాడిని. అటువంటి నన్ను చెప్పులతో కొట్టమని ప్రజలని రెచ్చగొడుతున్నాడు. ఏదో విధంగా నన్ను డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు కానీ అది అతని వలన కాదు. 2003లో నాపై జరిగిన హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులతో వైకాపాకి సంబంధాలు ఉన్నాయని తెలిసింది,’ అని చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

జగన్ తనని ‘డిస్టర్బ్ చేయాలని’ ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు నాయుడు చెప్పడం గమనిస్తే, జగన్ కుట్రలతో ఆయన నిజంగానే చాలా డిస్టర్బ్ అవుతున్నట్లు అర్ధం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గత రెండున్నరేళ్ళుగా చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎనాడూ ఆయనపై పైచెయ్యి సాధించలేకపోయారు. కానీ వైకాపా ఫ్లెక్సీ బ్యానర్స్ పై జూనియర్, సీనియర్ ఎన్టీఆర్ ల ఫోటోలు ముద్రించి ఒకసారి, ఓటుకి నోటు కేసులో అప్పుడూ ఇప్పుడూ చంద్రబాబు నాయుడుని చాలా డిస్టర్బ్ చేయగలిగారు. అయితే ఈ రాజకీయ కుట్రల వలన చంద్రబాబు చాలా డిస్టర్బ్ అవుతున్నప్పటికీ మళ్ళీ ఏదోవిధంగా బయటపడుతూనే ఉన్నారు. కనుక ఈ రాజకీయ గెరిల్లా యుద్ధంలో కూడా జగన్ ఓడిపోయినట్లే చెప్పక తప్పదు. బహుశః అందుకు వైకాపా మూల్యం చెల్లించవలసి వచ్చినా ఆశ్చర్యమేమీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close