విశాఖ నుంచి పాలన -నైతిక పతనానికి పరాకాష్ట !

విశాఖకు వెళ్లిపోయి పరిపాలన చేయడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని మంత్రులతో చెప్పిస్తున్నారు. రాజధాని అంశం న్యాయస్థానాల్లో ఉంది. తేలకుండా సీఎం జగన్.. తనకు తాను విశాఖ వెళ్లిపోయి .. క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగిస్తే నైతికంగా అంత కంటే దారుణమైన పతనం మరొకటి ఉండదు. ఓ ముఖ్య మంత్రిగా ఉండి వ్యవస్థల్ని గౌరవించడం ప్రధాన లక్షణం. కానీ తాను ఏదో మోనార్క్‌నన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం అందరికీ ఏర్పడుతుంది. ఇప్పటికే ఆయన తీరుపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.

సీఎం ఎక్కడి నుంచయినా పరిపాలించవచ్చని కొత్త కథలు చెబుతున్నారు. నిజమే.. పరిపాలించవచ్చు. కానీ ఓ ముఖ్యమమంత్రి అలా చేయవచ్చా ? నమ్మి ఓట్లేసిన ప్రజలను ఇంత ఘోరంగా అవమానించడానికి సిద్దపడవచ్చా ? సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే రాలేదు. కేంద్రం సహా అన్ని పక్షాలు తమ వాదనలు వినిపించాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. అప్పటి వరకూ రాజధానిని కదిలించడానికి అవకాశం లేదు. అలా చేస్తే కోర్టు తీర్పు ఉల్లంఘన అవుతుంది. ఈ మాత్రం జగన్‌కు తెలియదా ?

అయితే ఇప్పటి నుంచే వైఎస్ఆర్‌సీపీ వర్గాలు.. సమర్తించుకునేందుకు వాదనలు సిద్దం చేసుకున్నాయి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి … స్థానిక ఎన్నికలలో విజయమే.. తమ మూడు రాజధానుల విధానానికి ప్రజల మద్దతు లభించిందనడానికి సాక్ష్యమంటున్నారు. ఇదే వాదన ముందు ముందు బలంగ వినిపించే అవకాశం ఉంది. నిజమేంటో ఆయనకు తెలుసు. నిజంగా… ఆయన ప్రజల మద్దతు ఉందని చెప్పుకోవాలనుకంటే… మూడు రాజధానుల అంశంపై ఆయన ప్రజాతీర్పు కోరాలి. అ అజెండా ప్రకారం ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. కానీ అలా చేయడం లేదు.

గత ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని .. వైసీపీ… జగన్ ఆరున్నొక్క రాగాలతో ఆలపించారు. ఇప్పుడు మూడు అంటున్నారు. చట్ట, న్యాయపరంగా సాధ్యం కాకపోయినా మొండిగా విశాఖ వెళ్లిపోతామంటున్నారు. ఇంత కంటే దారుణమైన పతనం ఏరాజకీయ నేతా చూసి ఉండరు. కానీ జగన్ మాత్రం అక్కడ్నుంచే ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close