27న జగన్ – కేసీఆర్ భేటీ..! ఈ సారి జల వివాదాల పరిష్కారం..!

తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలు… వెల్లి వెరిస్తున్నాయి. విభజన సమస్యలను.. చిటికెలో పరిష్కరించేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాల సమస్యను మూడు రోజుల్లోనే పరిష్కరించేశారు.. ఇరువురు ముఖ్యమంత్రులు. ఆ భవనాలన్నింటినీ పది రోజుల్లోనే తెలంగాణకు దఖలు పడ్డాయి. విభజన చట్టం ప్రకారం పార్లమెంట్ కేటాయించిన భవనాలను ఏపీ వద్దు అనుకున్నా.. తెలంగాణ స్వాధీనం పర్చుకోవాలంటే.. చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కూడా పది రోజుల్లోనే పూర్తి చేసేశారు. అలాగే ఇతర సమస్యలనూ పరిష్కరించుకోబోతున్నారు.

నీటి కేటాయింపులను సమీక్షించబోతున్న ముఖ్యమంత్రులు..!

ఇరవై ఏడో తేదీన అమరావతిలో కేసీఆర్ – జగన్ సమావేశం కాబోతున్నారు. జల వివాదాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా నీటి కేటాయింపులపై సీఎంల మధ్య చర్చ జరగనుందని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలకు హక్కు ఉంది. విభజన నాటికి రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కను నిర్ధరించారు. ఇప్పుడు… ఉన్న ప్రాజెక్టుల ఆధారంగా.. ఈ నీటి వినియోగంపై ప్రధానంగా.. సీఎంలు చర్చించబోతున్నారని చెబుతున్నారు.

స్నేహ సంబంధాల కోసం ఇచ్చుడేనా..? తెచ్చుకునేది ఏమైనా ఉందా..?

పొరుగు రాష్ట్రంతో సన్నిహిత సంబంధాల కోసం జగన్మోహన్ రెడ్డి… తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినప్పటికీ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ ప్రాజెక్ట్ వల్ల ఏపీకి నష్టం జరుగుతుందన్న వాదన చాలా కాలం నుంచి ఉంది. ఇప్పుడు… ఆ ప్రాజెక్ట్ వల్ల.. ఎలాంటి నష్టం లేదని.. ఏపీకి రావాల్సిన నీళ్లు వస్తాయనే భరోసాను.. ఇరవై ఏడో తేదీన జగన్మోహన్ రెడ్డి పొందాల్సి ఉంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌, కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన అంశాలపై కూడా వీరు మాట్లాడనున్నారు. కృష్ణా, గోదావరి బోర్డులు అవసరమా లేదా.. అన్నది కూడా తేల్చనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో జల వివాదాలు పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతాయనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే… జలవివాదాల్లోనూ.. అదే ధోరణి ఉండనుంది.

నష్టపోయినా వివాదం పరిష్కారం అయితే చాలనుకుంటారా..?

జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో.. కేసీఆర్ కొంత కాలంగా ఏపీ పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి… గెలిచిన తర్వాత తొలి సారి ప్రగతి భవన్‌కు వెళ్లినప్పుడు… తెలంగాణ ఎంత చేసినా.. ఎడెనిమిది వందల టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోదని… మిగిలే… 17వందల టీఎంసీలను ఏపీ వాడుకోవచ్చని సూచించారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరి మధ్య భేటీలో… నీటి కేటాయింపులపై స్పష్టత వస్తే.. రెండు రాష్ట్రాలు.. వివిధ వివాదాలపై ట్రైబ్యునళ్లు, కోర్టుల్లో ఉన్న కేసులను ఉపసంహరించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close