ఇండియన్ ఎక్స్‌ప్రెస్ స్టోరీ : జగన్ లేఖ వల్లే ఏపీ హైకోర్టు సీజే బదిలీ..!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్మెంట్ సమయంలో ఇచ్చిన తీర్పు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులు..న్యాయవ్యవస్థపై ఆయన వైఖరి వెల్లడించిన వ్యవహారం న్యాయవర్గాల్లో చర్చనీయాంశమయింది. అయితే ఇలాంటి సమయంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక మాత్రం భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీరియస్‌గా తీసుకున్నారని అందుకే.. ఏపీ హైకోర్టు సీజేఐని సిక్కింకి బదిలీ చేశారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతే కాదు.. సీఎం జగన్ రాసిన లేఖను.. ఫిర్యాదు రూపంలో అఫిడవిట్‌లా చేసి పంపాలని కూడా జగన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ బోబ్డే కోరినట్లుగా ఆ పత్రిక తెలిపింది.

జగన్ చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకునే అనేక విధాలుగా సమాచారం తెప్పించుకున్నారని.. సీజేఐ బోబ్డే తర్వాత సీనియార్టీలో ఉన్న ఎన్వీరమణ… హైకోర్టు రోస్టర్‌లో జోక్యం చేసుకున్నారన్న విషయంపైనా వివరాలు తెప్పించుకున్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తన కథనంలో చెప్పుకొచ్చింది. అదే సమయంలో జస్టిస్ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి నుంచి వివరణ కూడా తీసుకున్నారని చెబుతున్నారు. అలాగే.. ఈ అంశంపై.. సీజేఐ తన సహచర న్యాయమూర్తులతో చర్చించారని కూడా కథనంలో పేర్కొన్నారు. అయితే ఒక్క ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాత్రమే ఈ వివరాలను ప్రకటించింది. దేశంలో ప్రసిద్ధి చెందిన లా జర్నల్స్, వెబ్ సైట్స్ చాలా ఉన్నాయి. ప్రతీ చిన్న విషయాన్ని కూడా రిపోర్ట్ చేస్తూంటాయి.

వాటిలో ఒక్కటి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. నిజంగా.. ముఖ్యమంత్రి నుంచి ఫిర్యాదు రూపంలో తాను రాసిన లేఖను అఫిడవిట్ రూపంలో పంపాలని సీజేఐ వ్యక్తిగతంగా కోరరు. అధికారికంగానే కోరుతారు. అందువల్ల అది కాన్ఫిడెన్షియల్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే న్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీలు చేశారంటే… ఆ విషయం కూడా గుప్పుమనకుండా ఉండదు. గతంలో అనేక సందర్భాల్లో బయటకు వచ్చాయి. సుప్రీంకోర్టు కొలిజీయం.. రొటీన్ ప్రక్రియలో భాగంగానే బదిలీలు చేసిందని న్యాయవాద వర్గాలు నమ్ముతున్నాయి.

అయితే..జగన్ లేఖ రాసిన తర్వాత బదిలీలు చేయడం వల్ల.. ఆ లేఖ వల్లేననన్న అభిప్రాయం ఏర్పడుతందని న్యాయనిపుణులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అలాంటి అభిప్రాయం బలంగా కల్పించడానికి కొన్ని మీడియా సంస్థల ద్వారా ప్రయత్నిస్తున్నారని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కథనంలో నిజానిజాలుంటే బయటపడటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఎందుకంటే.. కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద.. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఫిర్యాదు రూపంలో అఫిడవిట్ పంపాలని కోరడం గోప్యంగా ఉంచగలిగేంత చిన్న విషయం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close