ఖండన ప్రకటనలో కూడా జగన్ అదే గోల?

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో సాక్షి ప్రసారాలను నిలిపిసినందుకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ఇటువంటి సమయంలో కూడా ఆయన తన ముఖ్యమంత్రి కలను మరిచిపోకుండా ‘ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి’ అని పదేపదే చెప్పడం చాలా ఆశ్చర్యం, వినోదం కూడా కలిగిస్తుంది. అసలు ఒక సీరియస్ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తన మనసులో ఆ కోరికని దాచుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇంతకీ ఆయన ఏమ్మన్నారంటే “ఒక ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న అభ్యర్ధి కానీ ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా దానికి అర్ధం ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. లేకుంటే ఆ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి మాటలకి విలువ ఉండదు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి ప్రజలలో తన విశ్వసనీయత కోల్పోతారు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తికి మాట నిలకడ చాలా అవసరం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం విషయంలో, తుని కేసు విషయంలో, కాపులకి రిజర్వేషన్ల విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు,” అని అన్నారు.

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాట నిలకడ లేదు…ఎప్పుడూ అబద్ధాలే చెపుతుంటారు..అందుకే ఆయనకి విశ్వసనీయత లేదు,” అని చెపితే సరిపోయే దానికి “ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి” అనే పదం కూడా అదనంగా తగిలించి చెప్పుకోవడం చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్ధం అవుతుంది. అయితే ఇప్పుడు ఆయన ఎంతగా తహతహలాడినా కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ఖచ్చితంగా తెలిసిఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే నవ్వులపాలవకుండా ఉండేవారు. ఆయన ఆ మాట పదేపదే చెపుతున్న సమయంలో రాజకీయ దురందరుడని పేరు గాంచిన బొత్స సత్యనారాయణ ఆయన పక్కనే నిలబడి ఉన్నారు. ఆయన కూడా వారించే ప్రయత్నం చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close