అమరావతి నిర్మాణాలపై జగన్ మాటలన్నీ ఉత్తుత్తివే..!

అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలన్నీ పూర్తి చేయండి… రైతులకు ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కల్పించండి.. ఇందు కోసం రూ. మూడు వేల కోట్లు అప్పులు చేయండి.. గ్యారంటీ ఇస్తామంటూ మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఎం జగన్ హడావుడి చేశారు. అంతా నిజమేమో అనుకున్నారు. తీరా ఇప్పుడు.. ప్రభుత్వం..రుణాలకు గ్యారంటీ ఇవ్వడానికి…సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం ఆదేశించిన ప్రకారం…సీఆర్‌డీఏ అధికారులు .. రుణాల కోసం బ్యాంకులను సంప్రదించారు. మూడు బ్యాంకుల కన్సార్షియం రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో సూచించిన విధంగా కాకుండా ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక ప్రణాళికను రూపొందించాలని సీఆర్డీఏను గతంలో ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా సీఆర్డీఏ ఒక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి అందించింది. ఈ ప్రణాళిక ప్రకారం మౌలిక సదుపాయాలు పూర్తిచేసేందుకు 3 వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణం తీసుకోవాలని ప్రభుత్వం సీఆర్డీఏకు సూచించింది. ఈ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కానీ గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సాకులు వెదుకుతోంది.

ప్రభుత్వం ఇప్పటికే పరిమితికి మించిరుణాలు సేకరించింది. కార్పొరేషన్ల పేరుతోనూ రుణాలు తీసుకుంది. ఇంకా తీసుకోవడానికి మెడికల్ కార్పొరేషన్లు పెడుతోంది. ఉన్న కార్పొరేషన్లకు ఆస్తులు బదలాయిస్తోంది. ఇలాంటి సమయంలో… బ్యాంకులు వచ్చి గ్యారంటీ అడిగితే…అనేక నిబంధనలు పెట్టింది. దీంతో ప్రభుత్వానికే అమరావతి కోసం రుణం తీసుకోవడం ఇష్టం లేదని గుర్తించిన బ్యాంకులు సైలెంటయిపోయాయి. మూడు బ్యాంకుల్లో ఒకటి ఇప్పటికే వెనక్కి తగ్గగా..మరో రెండు.. బ్యాంకు నిబంధనల ప్రకారం గ్యారంటీ ఇస్తే.. ఆలోచిస్తామని చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close