ఇదేమి గ్రహబలమోనని జగన్‌ వ్యాఖ్యా…!

✍ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహబలాల్లో తేడా వచ్చిందా? ఈ అనుమానం ఏదో మామూలు వ్యక్తికి వచ్చి ఉంటే పర్వాలేదు కానీ క్రైస్తవ మతస్తుడైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కి రావడమే వింత గొలుపుతోంది. తొలిరోజు అసెంబ్లీలో ఉదయం 11.06 గంటలకు ముహూర్తం గవర్నర్‌ చేత ప్రసంగాన్ని ప్రారంభింపజేస్తే 11.10 గంటకు సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందని, ఇదేమి గ్రహబలమోనని జగన్‌ వ్యాఖ్యానించడంలో చాలా అర్థాలే ఉన్నట్లు తెలుస్తోంది.
ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందనే విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలికిపాటుకు లోనయ్యారని, ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లిం చేందుకే అసెంబ్లీ ముగిసిన అరగంటకే విలేకరుల సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా మాట్లాడారని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.

👉 ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయమని, ఈ విషయం చంద్రబాబుకూ తెలుసు, మనకూ తెలుసన్నారు. విలేకరులు ప్రశ్నించినపుడు అదేదో చాలా తేలికైన విషయం అన్నట్లుగా చంద్రబాబు తోసిపుచ్చారన్నారు. తనపై 26 కేసులు పెట్టారని ఏమీ కాలేదని చంద్రబాబును మీడియా అడిగినపుడు చెప్పారని అయితే ఏ కేసు కూడా విచారణ దశ వరకు వెళ్లలేదనే విషయం మాత్రం చెప్పలేదని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు తన చాకచక్యం, పలుకుబడి వినియోగించి చాలా కష్టపడి స్టేలు తెచ్చు కుంటారని జగన్‌ అన్నారు.

👉 తొలిరోజు అసెంబ్లీలో ఉదయం 11.06 గంటలకు ముహూర్తం గవర్నర్‌ చేత ప్రసంగాన్ని ప్రారంభింప జేస్తే 11.10 గంటకు సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందని, ఇదేమి గ్రహబలమోనని జగన్‌ వ్యాఖ్యానించారు.

👉తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నంలో నల్లధనం ఇస్తూ అడ్డంగా దొరికి పోయినా రాజీనామా చేయకుండా ఉన్న ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద చంద్రబాబు ఒక్కరేనని జగన్‌ అన్నారు.

👉 ‘రాష్ట్ర ప్రభుత్వం చాలా అసహనంతో వ్యవహరిస్తోంది. వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అక్రమంగా కేసులు పెట్టి వేధింపు చర్యలకు పాల్పడుతోంది. దిద్దుకుంటే ప్రజాస్వామ్యంలో నాయకులవుతారు. కళ్లు నెత్తికెక్కిన వారికి ప్రజాస్వామ్యం కచ్చితంగా పాఠం నేర్పుతుంది’ జగన్‌ పేర్కొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close