జగన్ స్వయంకృతమే ఈ మహాపరాధం!

అధికార పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వలస రావడం అనేది ఇవాళ్టి రాజకీయాల్లో.. ప్రభుత్వాలు ఏర్పడిన తొలిరోజునే జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేని పరిస్థితి ఉంది. (నంద్యాల వైకాపా ఎంపీ చేరిక) రాజకీయాల్లో నైతిక విలువలు, పార్టీల పట్ల కట్టుబడి ఉండడం అనే సిద్ధాంతాలకు కాలం చెల్లిపోతున్న నేపథ్యంలో నాయకులు ఎడా పెడా పార్టీలు మారిపోతున్నారు. అధికార పార్టీ తమను చల్లగా చూస్తే చాలు.. గంతులేసుకుంటూ వెళ్లిపోవడానికి విపక్షాల్లో చాలామంది నాయకులు ప్రతిసందర్భంలోనూ సిద్ధంగానే ఉంటున్నారు.

తెలంగాణలో ఈ విషయాన్ని తొలిరోజునుంచి మొన్నమొన్నటి వరకు బాగానే నిరూపించింది. ప్రతిసందర్భంలోనూ తెతెదేపా నాయకులు ఈ పోకడల్ని నిరసించారు. ఏపీలో తాము ఆ పనిచేయడం లేదని సెలవిచ్చారు. నిజానికి వైకాపా ఎమ్మెల్యేలనుంచి చంద్రబాబునాయుడుతో సత్సంబంధాలు సాగిస్తూ.. తెదేపాలోకి రావడానికి ఉత్సాహం ఉన్న వారు చాలా కాలంనుంచి అడుగుతున్నా చంద్రబాబు మిన్నకున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్‌ ఎప్పటినుంచో బాబు భజన చేస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు ఈ పోకడలు తనకు ఇష్టం లేవనుకున్నారో.. లేదా ఇది సమయం కాదనుకున్నారో.. మొత్తానికి ఆగుతూ వచ్చారు.

కానీ.. తాజా చేరికల విషయంలో జగన్‌ స్వయంగా చంద్రబాబును కెలికి ఈ చేరికలకు తెరెత్తినట్లుగా కనిపిస్తోంది. తెదేపా రాజకీయాలు సజావుగా సాగిపోతోంటే.. జగన్‌ వారిని రెచ్చగొట్టి వదిలాడనే చెప్పాలి. తెదేపా ఎమ్మెల్యేలు అనేకమంది నాతో టచ్‌లో ఉన్నారు. 21 మంది అయిపోగానే ప్రభుత్వం కూలుస్తా. నేను తలచుకుంటే.. గంటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని చాలా దూకుడుగా ప్రకటించి.. చంద్రబాబుకు చిర్రెత్తించారు. ఇలాంటి ప్రగల్భాలు ఎవరికైనా చిరాకు పుట్టిస్తాయి. రాజకీయంగా చాణక్యుడు అయిన చంద్రబాబుకు మరింత ఆగ్రహం కలిగించాయి. మౌనంగా సంయమనం పాటించిన చంద్రబాబు ప్రస్తుతం తొలిఅంకం పూర్తిచేశారు. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ చేరడం జరిగిపోయింది. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు లైన్లో వున్నారని వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ.. ఈ వ్యవహారం ఇలా రచ్చకెక్కి వైకాపా పతనాన్ని నిర్దేశిస్తున్న ప్రస్తుత పరిణామాలు వైఎస్‌ జగన్‌ స్వయంకృత మహాపరాధాలుగానే విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశం ఉన్నా మౌనం పాటిస్తున్న చంద్రబాబును రెచ్చగొట్టి జగన్‌ ఈ పరిస్థితి కొనితెచ్చుకున్నాడని అంటున్నారు. జగన్‌ ఎందరు పెద్ద నేతల్ని పంపి భూమాతో రాయబారాలు నడిపినా ఆయన ఖాతరు చేయలేదు. చివరికి వారు పార్టీ వీడిపోయే నాటికి.. జగన్‌ తన కేసుల గొడవలు చూసుకోవడానికి ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ, ఇక్కడ పార్టీ ఎలా పతనం అయిపోతున్నదో పట్టించుకునే స్థితిలో కూడా లేకపోవడం ఆయన పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close