పులివెందుల కాదు మరింత సేఫ్ సీటు కోసం జగన్ వెదుకులాట !

ఏపీ సీఎం జగన్ కు పులివెందుల కంటే సేఫ్ సీటు ఉంటుందా ?. కానీ అది నిన్నటి వరకూ కానీ ఇప్పుడు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు.. అవినాష్ రెడ్డి తండ్రి జైల్లో ఉండటం . అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లే పరిస్థితులు ఉండటంతో క్యాడర్ ను కంట్రోల్ చేయడం కష్టంగా మారుతోంది. ఇప్పటి వరకూ జగన్ అక్కడ పోటీ చేశారు కానీ నేరుగా క్యాడర్ తో దిగువ స్థాయిలో సంబంధాలు కలిగి లేరు. అక్కడి వ్యవహారం మొత్తం అవినాష్ రెడ్డి కుటుంబం చేతుల్లో ఉంది. వైఎస్ కుటుంబంలో చీలిక కారణంగా .. చాలా మంది అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి డామినేషన్ పై ఆగ్రహంతో ఉన్నారు.

పులివెందులలో మారుతున్న రాజకీయాలతో జగన్ వర్గం ఆందోళన

అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి సునీత చేస్తున్న న్యాయపోరాటం రాజకీయంగా ఏ ములుపు తిరుగుతుందో చెప్పడం కష్టమంటున్నారు. ఆమె టీడీపీలో చేరుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. పదే పదే అదే చెబుతున్నారు. ఇదే వారి ఆందోళనను స్పష్టంగా తెలియచేస్తోందని అంటున్నారు. ఇటీవల పులివెందులలో టీడీపీ కార్యకలాపాలు చురుగ్గా ఉన్నాయి. బీటెక్ రవి చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకున్నా టీడీపీకే మెజార్టీ వచ్చింది. టీడీపీ తరపున గెలిచిన భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పులివెందుల నేతే. దీంతో పులివెందులలో టీడీపీ పట్టు పెరుగుతోందని భావిస్తున్నారు.

ఖచ్చితంగా గెలిచే సీటు కోసం ఐ ప్యాక్ సర్వేలు

వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చినందున.. వారిఏకపక్షంగా ఈ సారి ఓట్లేసే పరిస్థితి లేదని కొంత మంది సునీత వైపు మొగ్గితే.. రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. అందుకే మరితం సేఫ్ సీటు కోసం జగన్ సర్వేలు చేయిస్తున్నారని అంటున్నారు. జమ్మలమడుగుతో పాటు మరో రెండు నియోజకవర్గాల్లో ఐ ప్యాక్ టీములు విస్తృతంగా సర్వేలు చేస్తున్నాయి.

పెడన, పెదకూరపాడుల్లో టీడీపీ గెలుపు ఖాయమంటున్న కూలి మీడియా

జగన్ సీటు మారేందుకు సర్వేలు చేయిస్తున్నారన్న విషయం బయటకు తెలియడంతో వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా లోకేష్ మంగళగరిలో పోటీ చేయడం లేదని.. టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్న పెడన, పెదకూరపాడుల్లో పోటీ చేస్తారన్న ప్రచారం చేస్తున్నారు. మంగళగిరిలో లోకేష్ ఇప్పటికే ఇంటింటికి వెళ్లారు. అక్కడ ఆయన వేవ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీలో పరిస్థితి గందరగోళంగా మారింది. అయితే వైసీపీ మీడియా టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని కొన్ని నియోజకవర్గాల పేర్లు చెబుతున్నారు కానీ. . కడప జిల్లాలో పులివెందుల కాకుండా ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం ఏదో మాత్రం చెప్పలేకపోతూండటం ఇక్కడ ట్విస్ట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close