కూలీల డబ్బులూ దారి మళ్లింపు..! జగన్‌కు కేంద్రం నుంచి కొత్త టెన్షన్..!?

ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అయితే..ఈ ఫిర్యాదు పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారో… శాంతిభద్రతలు క్షీణించాయనో కాదు… ప్రజలకు సంబంధించిన అంశంలో… కేంద్రం ఇచ్చిన నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందన్న అభిప్రాయంతో.. కేంద్రానికి లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు చెందాల్సిన ఉపాధి హామీ నిధులను.. ఏపీ సర్కార్ పక్కదారి పట్టించిందనే విమర్శలు వస్తున్నాయి. అవన్నీ పేదలు చేసిన పనులకు చెల్లించాల్సిన నిధులు. ఈ విషయంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కి చంద్రబాబు లేఖ రాశారు. ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకుని.. ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని లేఖలో కోరారు.

కేంద్రం పెండింగ్ బిల్లులు రూ.1845 కోట్లు విడుదల చేసినా… రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా జోడించి ఇంకా విడుదల చేయలేదని చంద్రబాబు లేఖలో కోరారు. ఉపాధి హామీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని … పెండింగ్ బిల్లులు చెల్లించకుండా నిధులు మళ్లించడం సరికాదని చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ చర్యలు ఉపాధి హామీ పధకం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. నిజానికి కేంద్రం.. ఉపాధి హామీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పేదలకు నేరుగా ఉపాధి కల్పించే కార్యక్రమం కావడంతో.. పక్కాగా అడిట్ చేసి నిధులు విడుదల చేస్తుంది. అయితే ఆ నిధులను.. ఏపీ సర్కార్ విడుదల చేయలేదు. వాటిని ఇతర అవసరాలకు వాడుకున్నారని… ప్రచారం జరుగుతోంది. దీంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ఇదే విషయాన్ని వ్యూహాత్మకంగా హైలెట్ చేస్తున్నారు. గత వారం నేరుగా జగన్‌కే లేఖ రాశారు. స్పందించకపోవడంతో ఇప్పుడు కేంద్రానికి లేఖ రాశారు. నిజానికి ఈ విషయంలో కేంద్రం కూడా అసంతృప్తిగా ఉంది.

జగన్ అనేక విషయాన్ని కేంద్రం మాటలను పెడ చెవిన పెడుతూండటంతో కేంద్రమంత్రులు కూడా అసహనానికి గురవుతున్నారు. ఈ గ్యాప్ ను సులువుగా అర్థం చేసుకున్న చంద్రబాబు.. కేంద్రానికి ఫిర్యాదు పంపారు. గతంలో వైసీపీ లేఖలతో.. కేంద్రం ఉపాధి హమీ నిధులు రాకుండా ఉడ్డుకుంది. ఇప్పుడు… చంద్రబాబు రివర్స్‌ లో ఏపీ సర్కార్ కు ఇచ్చిన నిధులు విడుదల చేయాలని లేఖ రాశారు. రియాక్షన్ ను బట్టి రాజకీయం కూడా మారే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close