వివేకా హత్య కేసు సీబీఐ కి ఇవ్వడం పై జగన్ యు-టర్న్

అమరావతి, సన్నబియ్యం, 45 ఏళ్ల పెన్షన్లు వంటివిషయాల్లోనే కాదు.. చివరికి సీబీఐ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిది ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాట ఒకటి.. అధికారంపక్షంలోకి మారిన తర్వాత మరొకటి. వివేకా హత్య కేసే దీనికి నిదర్శనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిందేనని కోర్టుల్లో తాను స్వయంగా పిటిషన్లు వేయడమే కాక.. వైఎస్ వివేకా భార్య పిల్లలతోనూ పిటిషన్లు వేయించారు జగన్మోహన్ రెడ్డి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే.. స్వయంగా ప్రభుత్వ లాయర్ చేత.. సీబీఐ విచారణకు ఇవ్వొద్దని.. న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేయించాల్సి వచ్చింది.

వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. గతంలో జగన్మోహన్ రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఇటీవలి కాలంలో అదే డిమాండ్ తో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వేసిన పిటిషన్లపై హైకోర్టులో జరిగిన విచారణలో.. ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడాన్ని నిర్మోహమాటంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. ఇలాంటి సమయంలో.. సీబీఐకి ఇవ్వడం మంచి కాదనేది.. ఏజీ ఉద్దేశం. నిజానికి సిట్.. విచారణలో ఏ మాత్రం పురోగతి సాధించలేదు. ఈ విషయం దాదాపుగా పదిహేను వందల మందిని అనుమానితులగా పేర్కొన్నప్పుడే స్పష్టమయింది. ఈ కేసును వీలైనంత వరకూ సాగదీసి.. చివరికి ఏటూ తేల్చకుండా పోలీసులు చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

నిజానికి గతంలో చంద్రబాబునాయుడు సీబీఐని.. ఏపీలో ఎంటర్ కాకుండా.. జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. అప్పట్లో బీజేపీతో జరిగిన పోరాటంలో… ఐటీ దాడులు.. జోరుగా సాగాయి. ఆ క్రమంలో సీబీఐ కూడా రెడీ అయిందన్న ప్రచారం జరగడంతో.. జనరల్ కన్సెంట్ ను చంద్రబాబు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాగానే.. జనరల్ కన్సెంట్‌ను పునరుద్ధరించింది. వెంటనే.. యరపతినేని అక్రమ మైనింగ్ కేసు విచారణ జరపాలంటూ.. సిఫార్సు చేసింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పుడు.. హైకోర్టు వివేకా హత్య కేసును సీబీఐకి ఇస్తే మాత్రం.. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి ఇస్తే.. తమ జుట్టు మరోసారి కేంద్రం చేతుల్లోకి వెళ్తుందేమోనని.. వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నారని.. అందుకే కేసు విచారణను సీబీఐకి ఇవ్వవొద్దంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close