బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న జగన్ : సీబీఐ

అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులను అతిక్రమిస్తున్నారని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిపు ఇవ్వని సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టులో జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై.. సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఆర్థికనేరాల్లో ప్రధాన నిందితుడు తనకుతాను చట్టానికి అతీతుడిగా నిలబడటం ప్రమాదకరమని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు నుంచి మినహాయింపు పొంది.. కోర్టునే లెక్కచేయడం లేదని సీబీఐ ఆరోపించింది. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారే సీబీఐ కోర్టుకు వచ్చారని గుర్తు చేసింది. సహేతుక కారణం లేకుండానే మినహాయింపు కోసం జగన్ మళ్లీ పిటిషన్ వేశారుని వారానికోసారి విజయవాడ నుంచి రావడం కష్టమనడం సమంజనం కాదని సీబీఐ కౌంటర్‌లో తెలిపింది.

నిందితులుగా ఉన్న అధికారులు చాలా మంది జగన్ పాలన పరిధిలో ఉన్నారుని.. ప్రజా ప్రయోజనాల కోసం జగన్ ప్రస్తావించిన అన్ని అంశాలను తోసిపుచ్చాలని.. సీబీఐ కోరింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారని… కోర్టుకు హాజరు కావాలనే చట్టబద్ధమైన విధుల నుంచి ఏదో ఒక కారణంతో తప్పించుకోవాలని చూస్తున్నారని సీబీఐ కౌంటర్‌లో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బెయిల్ సమయంలో జగన్ అంగీకరించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది. కేసు నమోదైనప్పటి నుంచి జగన్ రాజకీయాల్లోనే ఉన్నారని .. సీఎం అయినంత మాత్రాన కేసు పరిస్థితులు మారినట్లు కాదని సీబీఐ కౌంటర్‌లో తెలిపింది. జగన్మోహన్ రెడ్డి చేసింది భారీ కార్పోరేట్ కుంభకోణమని.. తన కంపెనీల ద్వారా క్విడ్‌ప్రొకో లబ్ధి పొందింది జగనేనని సీబీఐ స్పష్టం చేసింది.

ఒకవేళ హాజరు మినహాయింపునిస్తే రాజకీయ, ధన బలాన్ని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ కౌంటర్‌లో తెలిపింది. విచారణ ప్రక్రియ కనుచూపు మేరకు అందనంత దూరం వెళ్తోందని.. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయినా ఇంకా విచారణ ప్రారంభం కాలేదని సీబీఐ గుర్తు చేసింది. ఏదో ఒక నెపంతో విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని సీబీఐ తెలిపింది. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపిన భారీ ఆర్థిక కుంభకోణంలో జగన్ ప్రమేయం ఉందిన్నారు. రాష్ట్ర విభజన, జగన్ రాజకీయాలతో ఈ కేసుకు సంబంధం లేదని సీబీఐ స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close