జగన్ భరోసా రైతులకా…పార్టీకా?

జగన్మోహన్ రెడ్డి నిన్న కడప జిల్లాలో తన పులివెందుల నియోజక వర్గంలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న ముగ్గురు రైతుల కుటుంబాలని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ధిక సమస్యల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆ కారణంగా అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యిందని విమర్శించారు. ప్రతీ మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయని, వాటికి భయపడి జీవితాలు చాలించడం సరికాదని అన్నారు. కష్టాలలో ఉన్న రైతులకి వైకాపా అండగా నిలుస్తుందని జగన్ భరోసా ఇచ్చారు. అందరూ కలిసి తెదేపా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవిష్యత్ లో మంచి రోజులు వస్తాయని కనుక అందరూ అంతవరకు వేచి ఉండాలని ప్రజలకి హితవు పలికారు.

ప్రజలు, రైతుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారని చెప్పకతప్పదు. అవేమి ఆయన వ్యక్తిగత సమస్యలు కావు కనుక ఆ సమస్యలని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఉదాశీనంగా వ్యవహరించడం లేదా అసలు అవి ఉన్నట్లుగా గుర్తించనట్లు వ్యవహరిస్తోంది. జగన్ ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకొనేందుకు ప్రభుత్వమే అవకాశం కల్పిస్తోందని చెప్పక తప్పదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్కసు, విద్వేషంతోనే జగన్ ఈవిధంగా విమర్శలు చేస్తున్నారని తెదేపా నేతలు ఎదురుదాడి చేయవచ్చు కానీ జగన్ చెపుతున్న సమస్యలకి అది పరిష్కారం కాదు. ప్రతిపక్ష నాయకుడే ఇన్ని సమస్యలని గుర్తించగలుగుతున్నప్పుడు, గ్రామస్థాయి వరకు విస్తృత యంత్రాంగం ఉన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలని ఎందుకు సకాలంలో గుర్తించలేకపోతోంది? ఎందుకు పరిష్కరించలేకపోతోంది? అంటే జగన్ చెపుతున్నట్లు అశ్రద్ధ లేదా నిర్లక్ష్యమే కారణం అని చెప్పక తప్పదు. ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచే ఇటువంటి సమస్యలని పట్టించుకోకపోతే చివరికి నష్టపోయేది తెదేపాయే. తమని పట్టించుకోని ప్రభుత్వం కంటే కష్టకాలంలో వచ్చి ఓదార్చిన జగన్మోహన్ రెడ్డినే వారు అభిమానించడం తధ్యమని తెదేపా పెద్దలు గ్రహిస్తే వారికే మంచిది.

ఇక ప్రజా సమస్యలపై జగన్ చాలా చక్కగా పోరాడుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి కావాలనే తన బలహీనతని ఆ సందర్భంగా బయటపెట్టుకోవడం వలన ఆయన రైతులపై సానుభూతితో కాక, తన కోరిక నెరవేర్చుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారనే భావన కలిగేలా చేస్తున్నారు. “ప్రభుత్వంపై తిరగుబాటు చేద్దాం..మరికొన్నాళ్ళు ఓపిక పడితే మంచి రోజులు వచ్చేస్తాయి..” వంటి మాటలు అవే సూచిస్తున్నాయి. జగన్ ఆ విధంగా మాట్లాడకుండా, కేవలం ప్రజా సమస్యలు, ప్రభుత్వం అశ్రద్ధ గురించి మాట్లాడితే ఆయన ఆశించిన ప్రయోజనమే దక్కేది. కానీ తన ఆ బలహీనతని వదిలించుకోలేక మాట్లాడుతున్న ఇటువంటి మాటల వలన వ్యతిరేక భావన కల్పిస్తున్నారు. తనని విమర్శించేందుకు తెదేపాకి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎన్నికలలో గెలుపోటముల గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేనప్పుడు వచ్చే ఎన్నికలలో వైకాపాయే ఖచ్చితంగా గెలుస్తుందని, తనే ముఖ్యమంత్రి అయిపోతానని, చంద్రబాబు నాయుడు తీర్చలేని సమస్యలని, ప్రజల కష్టాలని మంత్రదండంతో మాయం చేసేస్తానన్నట్లు జగన్ చెప్పుకోవడం అవసరమా? ఆయన కూడా ఆలోచిస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close