జ‌గ‌ప‌తిబాబు + నారా రోహిత్‌

పెద‌బాబు, ఆంధ్రుడు సినిమాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప‌రుచూరి ముర‌ళి. బాల‌కృష్ణ‌తో తెర‌కెక్కించిన అధినాయ‌కుడు దారుణంగా నిరాశ ప‌రిచింది. అప్ప‌టి నుంచీ.. ప‌రుచూరి ముర‌ళి జాడ లేదు. ఇప్పుడు ఓ సినిమాతో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ క‌థానాయ‌కులుగా ఆయ‌నో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫ్రెండ్స్ మీడియా సంస్థ నిర్మించ‌నుంది. బుధ‌వారం ఈ చిత్రం లాంఛ‌నంగా మొద‌ల‌వుతుంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. రోహిత్ ప్ర‌స్తుతం బాల‌కృష్ణుడు సినిమాతో బిజీగా ఉన్నారు. పండ‌గ‌లా దిగివ‌చ్చాడు షూటింగ్ పూర్త‌యింది. ఈ రెండూ ఈ యేడాదే విడుద‌ల కానున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com