వారెవా : క్లాప్ కొట్టిన రోజే టీజ‌ర్‌

ఓ సినిమా మొద‌లయ్యాక టీజ‌రో, ఫ‌స్ట్ లుక్కో రావాలంటే కనీసం రెండు నెల‌లైనా ప‌డుతుంది. మ‌హేష్ బాబు – మురుగ‌దాస్‌ల కాంబో అయితే ఇందుకు మిన‌హాయింపే. వీళ్లు ఎంత టైమ్ అయినా తీసుకోవొచ్చు. మిగిలిన స్టార్లు య‌మా ఫాస్టుగా కాక‌పోయినా రీజ‌న‌బుల్‌గానే ఫ‌స్ట్‌లుక్‌లు విడుద‌ల చేస్తున్నారు. అయితే ఇప్పుడో సినిమా రిలీజ్ రోజునే టీజ‌ర్‌ని విడిచి పెట్టింది. అదే… `ప‌టేల్‌`. జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. వారాహి సంస్థ తెర‌కెక్కిస్తోంది. ఈ రోజే ఈ సినిమా క్లాప్ కొట్టుకొంది. అంత‌లోనే నిమిషం నిడివి ఉన్న ఓ టీజ‌ర్‌ని వదిలారు. అందులో చాలా ర‌కాలైన షాట్సే క‌నిపించాయి. డైలాగులూ వినిపించాయి. జ‌గ్గూభాయ్ లుక్ అయితే అదిరిపోయింది. సినిమా కంటెంట్ ఎలా సాగ‌బోతోందో.. చూచాయిగా చెప్పేశారు టీజ‌ర్‌లో.

ఈరోజు మొద‌లైన సినిమాకి టీజ‌ర్ రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంగ‌తే. అంటే.. ఈసినిమా ఎప్పుడో మొద‌లైంద‌న్న‌మాట‌.. అనుకోవొద్దు. నిజంగానే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. అయితే ట్రైల‌ర్ షూట్ మాత్రం జ‌రిగింది. వాటినే క‌ట్ చేసి టీజ‌ర్‌గా వ‌దిలార‌న్న‌మాట‌. ట్రైల్ షూటే ఇలా ఉంటే..సినిమా ఎలా ఉంటుందో మ‌రి. ఈ సినిమాతో వాసు ప‌రిమి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌నో యాడ్ ఫిల్మ్ డైరెక్ట‌ర్‌. ముంబైలో మంచి పేరుంది. సినిమాని సైతం యాడ్‌గా తీసి వ‌దిలుతున్నాడ‌న్న‌మాట‌. ఈ ట్రైల్ షూట్‌లో జ‌గ్గూభాయ్ లుక్ చాలా బాగుంది. ద‌ర్శ‌కుడిలో విష‌యం ఉంద‌న్న సంగ‌తి ఈ టీజ‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఫ‌ర్లేదు.. ఈ ప‌టేల్‌పై అంచ‌నాలు పెంచుకోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close