జ‌గ్గూభాయ్ లుక్‌… అద‌ర‌హో….

లెజెండ్‌తో జ‌గ‌ప‌తిబాబు జీవితం మ‌రో మ‌లుపు తిరిగింది. హీరోగా ఎంత సంపాదించాడో, ఎంత పోగొట్టుకున్నాడో తెలీదు గానీ, విల‌న్ పాత్ర‌ల‌తో మాత్రం జీవితం సెటిలైపోయింది. ఇప్పుడు బాలీవుడ్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టిస్తున్న ఓ సినిమాలో కీల‌క పాత్ర పోషించ‌డానికి ఒప్పుకున్నాడు జ‌గ‌ప‌తిబాబు. అదే.. `తానాజీ`. ఇందులో జ‌గ్గూభాయ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. శివాజీ కి సైన్యాధ్య‌క్షుడిగా ప‌నిచేశాడు తానాజీ. అత‌ని క‌థే… ఈ సినిమాకి మూలం. ఆ పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌నిపిస్తే… అత‌నికి ధీటుగా నిలిచే పాత్ర పోషిస్తున్నాడు జ‌గ్గూభాయ్‌. సోమ‌వారం నుంచి షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు. ప్ర‌స్తుతం ముంబైలో జ‌గ‌ప‌తిబాబు, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన జ‌గ్గూ ల‌క్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. విల‌న్ పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తి బాబుని, అత‌ని లుక్‌నీ చూసీ చూసీ విసుగొచ్చిన వాళ్లంద‌రికీ ఈ లుక్ రిలీఫ్ ఇస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లుక్ చూస్తే… జ‌గ్గూభాయ్ కూడా వీర సైనికుడిలా న‌టిస్తున్నాడ‌న్న విష‌యం అర్థం అవుతోంది. ఈ సినిమా, అందులోని జ‌గ్గూభాయ్ పాత్ర క్లిక్ అయితే… బాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలు రావ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com