ఇవాళ షర్మిల .. రేపు జూనియర్ ఎన్టీఆర్..!

తెలంగాణ రాజకీయ ప్రయోగశాలగా.., రాజకీయ పర్యాటక ప్రాంతంగా మారిందని .. తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నేతలు ఊసూరుమంటున్నారు. షర్మిల రాజకీయ పార్టీపై అనేక మంది వివిధ పార్టీల నేతలు స్పందించారు. చాలా మంది లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదన్నారు కానీ… కొంత మంది మా తెలంగాణ పరిస్థితి ఇలా అయిపోయిదేమిటి అని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో… సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరు. ఆయన తనదైన శైలిలో రాజకీయ వ్యాఖ్యలుచేస్తూంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంతో ఆయన మార్క్ ఆయనది. ఆయన షర్మిల పార్టీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు… తెలంగాణ పొలిటికల్ టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందన్నారు.

ఇవ్వాల షర్మిల, రేపు జూనియర్ ఎన్టీఆరో, మరొకరో వస్తారని నిర్వేదం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి నోటి వెంట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడం అనూహ్యమేమి కాదు. టీడీపీ సోషల్ మీడియా సర్కిల్స్‌లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ బాధ్యతల్ని జూనియర్ ఎన్టీఆర్‌కు ఇస్తారన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే… ఎన్టీఆర్‌కు… బాలకృష్ణ, చంద్రబాబుతో తీవ్రమైన విబేధాలున్నాయని… వారికి ప్రస్తుతం మాటల్లేవన్న చర్చ కూడా ఉంది. ఈ సందర్భంలో… ఇబ్బంది లేకుండా ఉండటానికి జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ బాధ్యతలిస్తారని కూడా చెప్పుకున్నారు.

ఆ విషయం జగ్గారెడ్డి దృష్టిలో పడిందేమో కానీ.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగ్గారెడ్డి సన్నిహితుడు. టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. ఆయన వైఎస్ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆయన షర్మిల విషయంలో మాత్రం ఏ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. బీజేపీ డైరక్షన్‌లోనే ఆమె పార్టీ పెడుతున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close