బడ్జెట్ రూ. 70 కోట్లు… పబ్లిసిటీ రూ. 7 కోట్లు

ప్రతీ సినిమాకీ పబ్లిసిటీ అవసరమే. చిన్న సినిమాలకూ, కొత్త సినిమాలకూ మరింత అవసరం. ఐతే ఆ సినిమా బడ్జెట్ తో మరో చిన్న సినిమా తీసేంత రేంజులో అయితే పబ్లిసిటీ అవసరం లేదనుకుంటా. జాగ్వార్ హడావుడి చూస్తే అదే అనిపిస్తోంది. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఈ సినిమా హీరో. జాగ్వార్ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏ నిర్మాత అయినా హీరో మార్కెట్ వాల్యూ ని బట్టే ఖర్చు పెడతాడు. కానీ హీరో ఇక్కడ ఓ మాజీ ప్రధానికి మనవడు, ఓ మాజీ ముఖమంత్రి తనయుడు. అందుకే డబ్బు వెదజల్లారు. ఈ సినిమాకి రూ. 70 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఆ లెక్కన ఇది సౌత్ ఇండియాలోనే ఖరీదైన డెబ్యూ.

టేకింగ్ కి అయిన ఖర్చు పక్కన పెడితే పారితోషికాల రూపంలో భారీ మొత్తం చెల్లించారట. ఉదాహరణకు జగపతి బాబు పారితోషికం 50 లక్షలు అనుకుందాం. ఈ సినిమాకి కోటిన్నర ఇచ్చారన్నమాట. కేవలం విజయేంద్ర ప్రసాద్ కథ కోసమే రూ. 75 లక్షలు ఇచ్చారట. ఇప్పుడు పబ్లిసిటీ పై పడ్డారు. అందుకోసం రూ. 7 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఆదివారం జరిగిన ఆడియో వేడుక భారీ ఎత్తున సాగింది. ఓ స్టార్ హీరో స్థాయిలో జరిగింది. ఇందుకోసం పొలిటికల్ మీటింగ్ లా జనాన్ని సమీకరించారట. రాయచూర్ నుంచి 1000 మందిని దింపారని తెలుస్తోంది. ఎంత హంగామా చేసినా కథలో, సినిమాలో దమ్ము ఉండాలి. లేదంటే సినిమా చూడ్డానికి కూడా జీతాలిచ్చి జనాలని దింపాల్సి వస్తుంది. మరి ఆ దమ్ము ఇందులో ఉందొ లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close