రివ్యూ : రొటీన్ కామెడీ మూవీ ‘జక్కన్న’

సోలో హీరో గా వరస పరాజయాలతో సతమతమౌతున్న స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా, సూపర్ హిట్ మూవీ ‘ప్రేమ‌క‌థాచిత్ర‌మ్’ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై, రాంగోపాల్ వర్మ శిష్యుడు ‘రక్ష’ దర్శకుడు, వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జక్కన్న’ ఈ రోజు విడుదల అయ్యింది. మన్నార్ చోప్రా హీరోయిన్ గా, నటించిన ఈ చిత్రం సునీల్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్, మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని నిర్మాత పలు ప్రెస్ మీట్ లో అనడం, మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ కావడం, సునీల్ బ్యాక్ టు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ సోష‌ల్ మీడియా లో ట్రెండ్ గా నిల‌వ‌టం ఈచిత్రం యెక్క క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. సునీల్ కామెడీ పరం గా, డాన్స్ అండ్ యాక్షన్ పరంగా మరి ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఈ చిత్రం ఉందా.? లేదా.? హీరో గా సరైన హిట్స్ లేని అతనికి ఈ చిత్రం అయినా ప్లస్ అవుతుందా లేదా..? నిర్మాత రెండవ చిత్రం ఫలితం ఎలా వుందో సమీక్ష లో తెలుసుకుందాం…

కథ :

మర్యాద రామన్న తరువాత సునీల్ కి సరైన కధే దొరక లేదు.’ జక్కన్న’ కథ అనడం కంటే పిట్ట కథ ఇది అనొచ్చు. తనకు సాయం చేసిన వారికోసం ఎంతదూరమైనా వెళ్ళి, ఎన్ని కష్టాలైనా పడి, వారి బాగుకోసం కష్టపడే మనస్థత్వం ఉన్న వ్యక్తి గణేష్ /జక్కన్న (సునీల్).. అలాంటి వ్యక్తికి వైజాగ్ సిటీకి పెద్ద రౌడీ అయిన భైరాగి (కబీర్ సింగ్) అనుకోకుండా ఒక సాయం చేస్తాడు. ఆ సాయానికి బదులుగా భైరాగి బాగుండాలని అతడి కోసం వెతుకుతూ గణేష్ వైజాగ్ వస్తాడు. గణేష్‌కి భైరాగి చేసిన సాయం ఏంటి? అసలు ప్రపంచానికి తానెవరో తెలీకుండా రౌడీయిజం చేసే భైరాగిని గణేష్ ఎలా కలుసుకుంటాడు? తనకు చేసిన సాయానికి బదులుగా భైరాగికి గణేష్ ఏం చేశాడు? హీరోయిన్ పాత్ర ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ…

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

సునీల్ సోలో హీరో గా ఈ మధ్య అతనికి కలిసి రావడం లేదు అనుకుంటా? వరుసపెట్టి కొన్ని ఫ్లాప్‌ సినిమాలు చేసిన సునీల్,ఈ సారి మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కధాంశం తీసుకుని చేసిన చిత్రం ‘జక్కన్న’ గత చిత్రాలలో మాదిరిగా ఈ సారి కూడా డాన్సస్, ఫైట్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాకా పోతే చాలా సాధారణ సన్నివేశాలు, నాసి రకం డైలాగ్స్ ఉన్నా కానీ తన మార్కు టైమింగ్‌తో అక్కడక్కడా ఓ కె అనిపించాడు. ఇక హీరోయిన్ గా చేసిన మన్నార్ చోప్రా మగరాయిడులా కనిపిస్తుంది. సినిమాలో ఆమెకు అంత ప్రాధాన్యత వున్నా పాత్ర లేదు. కేవలం గ్లామర్ కోసం పెట్టినట్టు వుంది. పాటల్లో, కొన్ని సన్నివేశాల్లో వీలైనంత అందాల ప్రదర్శన చేసింది. ఇక కమెడియన్స్ సప్తగిరి, ప్ర‌భాస్ శీను, అదుర్స్ రఘు, చేసిన కామెడీ, ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ చేసిన కామెడీ బాగుంది. విలన్ గా కబీర్ సింగ్ బాగానే రాణించాడు.

సాంకేతిక వర్గం:

గతం లో చేసిన సునీల్ సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తున్నామా? అనిపిస్తుంది. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ సునీల్ ని హ్యాండిల్‌ చేసిన తీరులో ఏ మాత్రం కొత్తదనం లేదు. కనీసం కామెడీ పరంగా అయినా కొత్తగా ట్రై చేయలేదు. అవసరం లేని సన్నివేశాలతో కన్‌ఫ్యూజన్‌ డ్రామా. ఇంటర్వెల్ వరకు కథ ఏమిటో మనం ఏం చూస్తున్నామో అర్ధం కాదు. సెకండాఫ్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక ఒక ఇరవై నిమిషాల ఎపిసోడ్‌ను ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. సి .రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ ఎం.ఆర్ వర్మ సినిమా ను ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది .పంచ్ డైలాగ్స్‌, ప్రాసల పరంపరలు సినిమా చూసిన తరువాత గుర్తుండేవి గా ఏవీ లేవు. దినేష్ పాటలు ఎందుకున్నాయో తెలీదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. ఇక సినిమా నిర్మాణ విలువల విషయానికొస్తే సినిమా కి అవసరమైన మేర ఖర్చు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడలేదు నిర్మాత సుదర్శన్ రెడ్డి. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా కూడా రిచ్ గానే అనిపించింది.

విశ్లేషణ :

హీరో సునీల్‌నే ఈ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. మొదట్నుంచీ చివరివరకూ సినిమాను అంతా తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ.. ఇలా కమర్షియల్ హీరో ప్రయత్నాలన్నీ ఎప్పట్లానే బాగానే చేశాడు. కమెడియన్ నుంచి కమర్షియల్ హీరోగా మారిన సునీల్, మొదట్నుంచీ తనకు బలమైన కామెడీనే నమ్ముకుంటూ వస్తున్నారు. ఈ సినిమాలోనూ అదే తరహా కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే దర్శకుడు తీసుకున్న కథ, కథనాల్లో బలం లేకపోవడం, రొటీన్ సినిమా నెరేషన్‌లోనే పెద్దగా ఎగ్జైటింగ్ అంశాలు లేకపోవడం లాంటివి ఈ సినిమాను ముందుకు నడిపించలేక పోయాయి. పాటలు వినడానికి ఏమాత్రం బాగోలేకపోగా, అవి వచ్చే సందర్భాలు అంతకు మించి బాలేవు. ఇక డైలాగ్స్ కూడా ఈ సినిమాకు మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. అంతటా ప్రాసలతోనే తప్ప ఎక్కడా సరైన డైలాగ్స్ లేవు. ప్రాసల ద్వారానే కామెడీ పుడుతుందనే ఆలోచన నచ్చలేదు. ఒక పూర్తి స్థాయి కామెడీ సినిమా అనుభూతి పొందాలనుకొని జక్కన్నను చూస్తే మాత్రం నిరాశ తప్పదు.రన్ కష్టమే….

తెలుగు360.కామ్ రేటింగ్ 2/5
బ్యానర్ : ఆర్ పి ఏ క్రియేషన్స్
నటీనటులు: సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ రాజ్, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్,
సంగీతం : దినేష్,
పాటలు : శ్యామ్ కాసర్ల, శ్రీ మణి,
ఆర్ట్ డైరెక్టర్ : మురళి,
ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్,
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ,
మాటలు : భవాని ప్రసాద్,
సహా నిర్మాతలు : ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి,
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ,
విడుదల తేదీ :29.07.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close