పాపం.. ‘జననాయగన్’. ఈ సినిమాకు ఎదురవుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విజయ్ కథానాయకుడిగా సి.హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. జనవరిలో రావాల్సింది. కానీ సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్ 30న ఈ సినిమాని విడుదల చేస్తారని భావించారు. కానీ నిర్మాతలు నిర్ణయం మార్చుకొన్నారు. తమిళనాడు ఎన్నికలు, ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో జూన్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. జూన్ 18న విజయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘జననాయగన్’ రిలీజ్ అయితే బాగుంటుందన్నది అభిమానుల ఆశ.
కానీ జూన్ లో టాక్సిక్ రావాలి. ఈమేరకు ఓటీటీ సంస్థతో ఒప్పందం కూడా జరిగిపోయింది. ఈ రెండు సినిమాల్నీ నిర్మించింది కేవీఎన్ సంస్థనే. కాబట్టి.. విజయ్ సినిమాని పక్కన పెట్టి, టాక్సిక్ రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. జూన్లో `టాక్సిక్` వస్తే… జులైలో ‘జననాయగన్’ రిలీజ్ చేస్తారు. విజయ్ సినిమా రాను రాను ఆలస్యం అవ్వడం ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతోంది. విజయ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, దాని క్రేజ్ దానికే ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. సినిమా రిలీజ్ ని ఓటీటీ శాశిస్తోంది. ‘జననాయగన్’ ఓటీటీ హక్కులు దక్కించుకొన్న సంస్థ ఇప్పుడు నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఏప్రిల్ 30న రాకపోతే.. ఓటీటీ డీల్ కాన్సిల్ చేసుకొంటామని కూడా హెచ్చరించింది. ఏప్రిల్ 30న ఎలాగూ ఈ సినిమా రాదు. సరికదా మరో మూడు నెలలు ఆలస్యం అవుతోంది. మరి సదరు సంస్థ ఓటీటీ డీల్ రద్దు చేసుకొంటుందా, లేదంటే ముందు అనుకొన్న మొత్తంలో కోత విధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
‘జననాయగన్’ ఓటీటీ హక్కులు రూ.120 కోట్లకు అమ్ముడైనట్టు టాక్. ఇప్పుడు అందులో 30 శాతం ఓత విధించే ఛాన్సుందని తెలుస్తోంది. నిర్మాతలకు ఇది దెబ్బే.
