‘జనగణ’ మంటలకు ఇప్పుడు ఆజ్యం పోస్తారా?

రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ గీతం జనగణమన ప్రస్తుతం మన దేశానికి జాతీయగీతంగా ఉంది. కానీ ఈ జాతీయగీతం చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకునే అవకాశం కనిపిస్తోంది. రవీంద్ర నాధ్‌ ఠాగూర్‌ దీనిని రాసినది బ్రిటిషు వారిని కీర్తిస్తూ, వారిని ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో మాత్రమేనని, అలాంటి గీతాన్ని జాతీయగీతంగాఉంచడం కరెక్టు కాదంటూ ఇప్పుడు కొత్త డిమాండు వినిపిస్తోంది. నిజానికి ఇది ఎంతో కాలంనుంచి ఉన్న డిమాండే. అసలే యావత్తు ప్రభుత్వంలో భాజపా (ఆరెస్సెస్‌) భావజాలాన్ని నింపడానికి చూస్తున్నదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీ సర్కారు ఈసారి రేగుతున్న అదే డిమాండుకు మరింత ఆజ్యం జతచేయవచ్చుననే వాదన వినిపిస్తోంది.

ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత గోపాల్‌దాస్‌ నీరజ్‌ (92) తాజాగా జనగణమన జాతీయగీతం హోదాకు తగదంటూ తన అభిప్రాయాన్ని తెరపైకి తెచ్చారు. ఇది ఆంగ్లేయుల పాలన గుర్తుకు తెస్తుందని దాని బదులుగా వందేమాతరం లేదా ఝండా ఊంఛా రహే హమారా గీతాల్లో ఒకటి ఉండాలనేది ఆయన వాదన. 1911లో యూకే రాజుగా అయిదోజార్జ్‌ పట్టాభిషేకం సందర్భంగా ఆయనను కీర్తించడానికి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ భారత్‌ తరఫున ఈ గీతం రాశారని, అధినాయక అనే పదం ద్వారా రాజు నియంతృత్వాన్ని, ‘భారత భాగ్య విధాత’ యూకే రాజు అనే భావనను ఆ గీతం నిత్యం గుర్తుకు తెస్తుంటుందని ఆయన వాదిస్తున్నారు. పైగా గీతంలోని సింధ్‌ ప్రాంతం కూడా ఇప్పుడు భారత్‌లోలేదని అంటున్నారు. మన దేశపు బానిసత్వాన్ని గుర్తు చేసే ఈ గీతం కాకుండా వేరే గీతాలను జాతీయ గీతాలుగా ఎంచుకోవాలని అంటున్నారు.

నిజానికి ఇది ఎంతోకాలంగా ఆరెస్సెస్‌ చేస్తున్న వాదన కూడా. ఇప్పుడు ఇంత సీనియర్‌ కవి ఇదే అంశాన్ని తెరమీదకు తేవడంతో దేశవ్యాప్తంగా దీని మీద మేధావులు అభిప్రాయాలు పంచుకోవడమూ.. ప్రభుత్వం దీనికి ఆజ్యం జతచేసి జనగణమన విషయంలో పునరాలోచించే పరిస్థితి రావడమూ జరుగుతుందేమోనని పలువురు అంచనా వేస్తున్నారు. జాతీయతా వాదం ముసుగులో ఆరెస్సెస్‌ భావజాలాన్ని దేశంలో నింపడానికి మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయగీతానికి కూడా ముప్పు పొంచి ఉన్నదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close