‘జ‌న‌నీ’ ఓ ఎమోష‌న‌ల్ డ్రైవ్‌: రాజ‌మౌళి

ఆర్.ఆర్‌.ఆర్ నుంచి మ‌రో పాట వ‌చ్చింది. అదే జ‌న‌నీ. నిజానికి రేపు ఈ పాట విడుద‌ల అవుతోంది. కానీ… తెలుగు మీడియా కోసం మాత్రం.. ఒక రోజు ముందే ఈ పాటని వినిపించాడు రాజ‌మౌళి. ఆర్కే కాంప్లెక్స్‌లో జ‌రిగిన ప్రెస్ మీట్లో ఈ పాట‌ని మీడియా కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. నిజానికి ఇది పాట కాద‌ని, ఓ ఎమోష‌న‌ల్ డ్రైవ్ అని.. రాజ‌మౌళి పేర్కొన్నాడు. ఆర్‌.ఆర్‌.ఆర్‌లోని ఎమోష‌న్నీ మ‌ణిహారం అయితే.. ఆ మ‌ణిపూస‌ల్ని ప‌ట్టి ఉంచే దారంలాంటిది ఈ జ‌న‌నీ పాట అని చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి. త‌న సినిమాల్లో ఆర్‌.ఆర్ చాలా కీల‌కం. స‌న్నివేశాల్ని ఎలివేట్ చేయ‌డానికి ప్ర‌త్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయిస్తాడు రాజ‌మౌళి. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో వినిపించే పాట ఇది.

”సినిమాలో రీ రికార్డింగ్ ప్రోసెస్‌ నేను చాలా ఎంజాయ్ చేసే మూమెంట్. అదో డిస్క‌వ‌రీ లాంటిది. నేను చేసిన దాంట్లోనే తెలియ‌ని కొత్త కోణాలున్నాయా అనేలా పెద్ద‌న్న రీ రికార్డింగ్ చేస్తాడు. 2 నెల‌లు రీ రికార్డింగ్ చేశాక‌… `ఇంకా ఏదో కావాలి.. దాన్ని ప‌ట్టుకోవాలి` అంటుండేవాడు. జ‌న‌నీ అనేది ఈ సినిమాకి కోర్ మెలోడీ. ఓ రోజు ఈ పాట ప‌ట్టుకుని వ‌చ్చాడు. లిరిక్స్ కూడా త‌నే రాశాడు. ఆర్‌.ఆర్‌.ఆర్‌లో చాలా ఎమోష‌న్లు ఉంటాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్స్ ఉంటాయి. వాట‌న్నింటిలోనూ కోర్ గా వినిపించి,క‌నిపించే పాట ఇది” అని జ‌న‌నీ గురించి చెప్పుకొచ్చాడు రాజ‌మౌళి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close