ఎవరు కలిస్తే ఆ పార్టీలోకి వంగవీటి వెళ్లిపోతారా !?

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం ప్లాన్డ్ గా జరిగింది కాదు. పవన్ కల్యాణ్ మూడో తేదీన చేపట్టనున్న జనవాణి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆడిటోరియం పక్కనే వంగవటి రాధా ఆఫీస్ ఉంది. దీంతో నాదెండ్ల మనోహర్ ఆయన ఇంటికి వెళ్లారు. టీ తాగారు. అంతే ఈ లోపు కొంత అత్యుత్సాహ మీడియా..సోషల్ మీడియా పులిహోర కలిపేశారు. వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలోకి వెళ్తారంటూ పుకార్లు ప్రారంభించాయి. అయితే భేటీ ముగిసిన తర్వాత ఇద్దరూ నేతలు చాలా కూల్‌గా రిప్లయ్ ఇచ్చారు.

కరెంట్ ఎఫైర్స్ కాదని కరెంట్ చార్జీలపై చర్చించామని నాదెండ్ల చెప్పారు. రాజకీయంగా ఎలాంటి విశేషం లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న ఆడిటోరియం పక్కనే ఉన్న తన ఆఫీసుకు వచ్చారని అందుకే మాట్లాడానన్నారు వంగవీటి. వంగవీటి రాధాకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు ఓ రకంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణలకు.. రంగా పేరుతో నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు.

ఎప్పుడైనా శుభకార్యాల్లో ఎదురుపడితే తన మిత్రులైన వైఎస్ఆర్‌సీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు కూడా ఆయన వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. ఈ నెల 4వ తేదీన దివంగత నేత వంగవీటి రంగా జయంతి కార్య‌క్రమాన్ని భారీగా నిర్వ‌హించేందుకు రాధా రంగా మిత్ర మండ‌లి ఏర్పాట్లు చేస్తోంది.ఈ కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా నిర్వ‌హిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవార్డుల్ని చూసి మురిసిపోతున్న కేటీఆర్ – టీడీపీ కూడా అంతే !

సేమ్ టు సేమ్ అని ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాలను చూస్తే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా బీజేపీతో పోరాటం విషయంలో... కేసీఆర్ సుకుంటున్న నిర్ణయాల...

మునుగోడులో పోటీ చేసేది టీఆర్ఎస్సా ? బీఆర్ఎస్సా ?

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతగా వ్యవహరించనున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటి లక్ష్యం మునుగోడు ఉపఎన్నిక. రెండు...

చరిత్రలో కలిసిన టీఆర్ఎస్.. ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి !

తెలంగాణ రాష్ట్ర సమితి అంతర్థానం అయింది. తమ పార్టీని భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)...

మునుగోడులో పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్ !

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన మ్యాజిక్‌ను అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటారు. తన మాటలతో ఈ సారి గద్దర్ నే పోటీకి ఒప్పించారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ తరపున గద్దర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close