వైసీపీ ఎంపీలపై జనసేన డిజిటల్ వార్ !

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని లైట్ తీసుకుని ఢిల్లీలో కూర్చుని రాజకీయ విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు షాక్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. వారు పార్లమెంట్‌లో కేంద్రంపై పోరాడేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అందులో భాగంగా డిజిటల్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. 18, 19, 20 తేదీల్లో ప్రజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి.. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

ఇరవై రెండు మంది వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రశ్నిస్తున్నారు. అన్యాయం జరుగుతున్నా నోరు మెదపని ఎంపీలు ఎందుకని ఘాటుగానే విమర్శిస్తున్నారు. అయితే పార్లమెంట్‌లో మాత్రం ఏపీకి చెందిన ఎంపీలు అరకొరగానే స్పందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని అసలు ఎవరూ పోరాటం చేయడం లేదు. కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించడం లేదు.టీడీపీ ఎంపీలు ముగ్గురు ఉన్నారు. వారు కూడా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని సభను స్తంభింపచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో వారిపై ఒత్తిడి తేవడం ఒక్కటే మార్గమని జనసేన అధినేత నిర్ణయించుకున్నారు. పా

జనసేన పార్టీ గతంలో రోడ్లను బాగు చేయాలన్న డిమాండ్‌తో ఇలాగే డిజిటల్ ఉద్యమం నిర్వహించింది. ఏపీ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, గుంతలు తేలిన రోడ్లను జనసేన కార్యకర్తలు ట్వీట్ చేసి.. వాటిని ట్రెండింగ్‌లోకి తీసుకు వచ్చారు. తర్వాత శ్రమదాన కార్యక్రమం కూడా చేపట్టారు. ఆ తరహాలోనే ఇప్పుడు ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close