తెలంగాణ పోలీసుల విచారణ కావాలంటున్న జనసేన..!

దేవాలయాలపై దాడుల అంశంలో విచారణను.. తెలంగాణ పోలీసులకు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం పోయిందని జనసేన నేత పోతిన మహేష్ చెబుతున్నారు. వందకుపైగా ఘటనలు జరిగినా ఒక్కరంటే.. ఒక్క నిందితుడ్ని పట్టుకోవడం దారుణ వైఫల్యమని.. అందుకే… తెలంగాణ పోలీసులకు విచారణ బాధ్యతలివ్వాలని ఆయన కోరుతున్నారు. హిందూఆలయాలపై దాడుల విషయంలో పోలీసులు రంపం దొరికింది.. ఒకటే వాడారు.. కుట్ర ఉంది.. లాంటి వివరాల్ని రోజూ మీడియాకు చెబుతున్నారు. అదుపులో ఇరవై మంది.. ముఫ్పై మంది అని లీకుస్తున్నారు. అసలు ఎవరు చేశారు..? ఎందుకు చేశారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.

పోలీసులు కూడా తేల్చలేకపోతున్నారు. అదే సమయంలో… ఈ విగ్రహాల ధ్వంసంపై విచారణ జరుపుతున్న వారందరూ క్రిస్టియన్లేనని విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. సీఎం జగన్ నుంచి రామతీర్ధం ఘటనపై విచారణకు నియమించిన సునీల్ కుమార్ వరకూ అందరూ క్రైస్తవలే. అందరూ మత ప్రచతారంలో పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో.. తమకు నమ్మకం లేదన్న ప్రకటనలు విపక్షాల నుంచి వస్తున్నాయి. సీబీఐకి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది… జనసేన మాత్రం సెటైరికల్‌గా తెలంగాణ పోలీసులకు ఇవ్వాలని కోరుతోంది.

గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అదే పనిగా.. పోలీసులపై విమర్శలు చేసేవారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలంగాణ పోలీసులకు వైసీపీ నేతలు చేసేవారు. వారు అక్కడ కేసులు నమోదు చేసి.. ఏపీలో నిందితుల్ని పట్టుకునేవారు. అయితే ఇప్పుడు.. వైసీపీనే అధికారంలోకి వచ్చింది. పోలీసుల పనితీరుపై విపక్షం విమర్శలు చేస్తోంది. అప్పట్లో నమ్మకం లేదన్న వైసీపీ .. ఇప్పుడు పోలీసులు దేశంలోనే అత్యంత సమర్థులని చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close