ఇసుక ప్రైవేటు చేతుల్లోకి, మద్యం ప్రభుత్వ చేతుల్లోకా?: జగన్ పాలన పై జనసేన ఫైర్

జగన్ పాలనలో- ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఇసుకను ప్రైవేటు పరం చేయడం, ప్రైవేటు వారి ఆధీనంలో ఉండే మద్యాన్ని ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదు అంటూ జగన్ పై జనసేన పార్టీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ లు వైఎస్సార్సీపీని , ఆ పార్టీ అభిమానులను ఇరకాటంలో పెడుతూ ఉంటే, సామాన్య ప్రజలను మాత్రం ఆలోచింపజేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జె పి పవర్ అనే సంస్థకు ఇసుక తవ్వకాలు, నిల్వ, అమ్మకానికి సంబంధించిన పనులు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నామమాత్రపు ఖర్చులతో దాదాపు ఉచితంగా లభించిన ఇసుక గత కొద్ది ఏళ్లుగా సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నూతన ఇసుక పాలసీని తీసుకొని వచ్చారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీని ప్రజలందరూ అభినందిస్తున్నారు అంటూ ప్రభుత్వ పెద్దలు తరచూ గొప్పలు చెబుతూ వచ్చారు. మరి ప్రజలందరూ అభినందిస్తున్నారని చెబుతూ వచ్చిన ఆ పాలసీని మారుస్తూ, తాజాగా ఒక ప్రైవేటు సంస్థకు ఇసుకను అప్పచెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీసింది.

అంతేకాకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో – వందకోట్లు దాటిన ఏ టెండర్ అయినా శివశంకరరావు చైర్మన్ గా ఉన్నటువంటి ఏపీ జుడిషియల్ కమిషన్ ద్వారా సమీక్ష చేయించిన తర్వాతే ఖరారు చేయాలని, 15 రోజులు పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయాలని చట్టం చేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, ఇప్పుడు జెపి పవర్ సంస్థకు ఇచ్చిన ఇసుక కాంట్రాక్టు విషయంలో ఈ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని, ఏపీ జ్యుడీషియల్ కమిషన్ తో ఎందుకు సమీక్ష చేయించ లేదని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన ఇసుక వంటి సామాజిక ఆస్తులను ప్రైవేటు పరం చేస్తూ, ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న మద్యం వంటివాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం చోద్యం అంటూ సెటైర్స్ వేశారు.

ఏదిఏమైనా తాజాగా వైఎస్ఆర్సిపి తీసుకున్న ఇసుక ప్రైవేటుపరం నిర్ణయాన్ని అటు విపక్షాలే కాకుండా సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close